బాలీవుడ్ అంతా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పిలుచుకునే అమీర్ ఖాన్ యాక్టింగ్ దర్శక ధీరుడు రాజమౌళికి నచ్చలేదట. ఈ విషయాన్ని స్వయంగా అమీర్ అన్న మన్సూర్ ఖాన్‌తోనే అన్నారట రాజమౌళి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ ఖాన్.. అమీర్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ చూసి రాజమౌళి ఎలా ఫీల్ అయ్యాడు. తనతో ఏమన్నాడు అన్న విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.


ఓవరాక్టింగ్ చేసుంటాను..
హాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ అయ్యి ఒక సెన్సేషన్‌ను సృష్టించిన ‘ఫారెస్ట్ గంప్’ అనే చిత్రాన్ని ‘లాల్ సింగ్ చడ్డా’ పేరుతో హిందీలో రీమేక్ చేశాడు అమీర్ ఖాన్. అలాంటి ఒక క్లాసిక్ చిత్రాన్ని టచ్ చేయడం కూడా చాలా పెద్ద తప్పు అని ప్రేక్షకులు వార్నింగ్ ఇచ్చినా వినలేదు. అందుకే బాక్సాఫీస్ దగ్గర ‘లాల్ సింగ్ చడ్డా’ ఫ్లాప్‌గా నిలిచింది. మన్సూర్ ఖాన్‌ ఇటీవల అమీర్‌కు, తనకు జరిగిన చర్చ గురించి బయటపెట్టాడు. ‘‘నువ్వు ఆ సినిమా బాగుంది అన్నప్పుడు నువ్వు చాలా మంచివాడివి కాబట్టి నీకు అలా అనిపించింది అనుకున్నాను. కానీ రాజమౌళి లాంటివారికి ఓవరాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది అంటే ఓవరాక్టింగ్ చేసే ఉంటాను’’ అని అమీర్ ఖాన్ తనతో చెప్పినట్టు మాన్సూర్ గుర్తుచేసుకున్నాడు.


అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు పుస్తక రచయిత..
అసలు అమీర్ ఖాన్‌ను హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేసిందే మన్సూర్. 1988లో విడుదలయిన ‘ఖయామత్ కే ఖయామత్ తక్’ అనే చిత్రంతో ప్రేక్షకులను తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు అమీర్. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది మరెవరో కాదు మన్సూరే. దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మన్సూర్.. ప్రస్తుతం రైటర్‌గా మారాడు. ‘వన్: ది స్టోరీ ఆఫ్ అల్టిమేట్ మిథ్’ అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకం గురించి ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న క్రమంలో మన్సూర్.. మరెన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. అమీర్‌కు నిజాయితీగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చే విషయంలో మన్సూర్ ఎప్పుడూ ముందుండేవారు. ముఖ్యంగా ‘లాల్ సింగ్ చడ్డా’ గురించి అనేక విషయాలను ఫ్యాన్స్‌కు పంచుకున్నాడు మన్సూర్. 


రాజమౌళి చెప్తేనే నమ్మాడు..
‘నాకు స్క్రిప్ట్ నచ్చింది, అతుల్ కులకర్ణి పనితీరు బాగుంది. అవును అమీర్ అయితే ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో కొంచెం ఓవర్ చేశాడు. అంటే ఆ క్యారెక్టర్‌కు పిచ్చి లేదు, డైస్లెక్సియా లాంటి వాటితో ఏం బాధపడడం లేదు. కాకపోతే ఆ పాత్ర అంతే. ఫారెస్ట్ గంప్‌లో టామ్ హ్యాంక్స్ నాకు చాలా నచ్చాడు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో క్యారెక్టర్‌ను కరెక్ట్‌గా చూపించారు. అమీర్‌కు కూడా నేను ఈ విషయం చెప్పాను. రాజమౌళి కూడా ఇదే విషయాన్ని చెప్పినప్పుడు అమీర్‌కు నేను చెప్పింది కరెక్టే అనిపించింది.’ అంటూ ‘లాల్ సింగ్ చడ్డా’లో అమీర్ యాక్టింగ్ గురించి గుర్తుచేసుకున్నాడు మన్సూర్ ఖాన్.


Also Read: లాంగ్ వీకెండ్‌లో నాలుగు చిత్రాల మధ్య పోటీ, ఏ సినిమాకు ఎంత వచ్చిందంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial