సీనియర్ హీరో త్రిష పేరు గతకొంతకాలంగా సోషల్ మీడియాలో పలు కారణాల వల్ల వైరల్ అవుతూ వస్తోంది. తను హీరోయిన్‌గా నటించిన ‘లియో’ మూవీ విడుదల తర్వాత అందులో ఒక చిన్న పాత్రలో నటించిన యాక్టర్ మన్సూర్ అలీ ఖాన్.. త్రిషపై చేసిన వ్యాఖ్యల వల్ల ఒక్కసారిగా సోషల్ మీడియాలో అంతా తిరిగిచూసింది. చాలామంది హీరోయిన్‌కే సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఈ విషయంపై చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కున్నారు మన్సూర్. తాజాగా త్రిషపై మరోసారి అలాంటి అనుచిత వ్యాఖ్యలే చేశారు ఒక రాజకీయ నాయకుడు. అయితే అనూహ్యంగా ఈ విషయంపై త్రిషను సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
చర్యలు తీసుకుంటాను..
ఇటీవల బహిష్కరణకు గురైన అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు మాట్లాడుతూ గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి రిసార్ట్‌కు తీసుకువచ్చాడు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ పొలిటీషియన్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏవీ రాజు వ్యాఖ్యలపై ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు మండిపడుతున్నారు. త్రిష సైతం అతడి వ్యాఖ్యలపై స్పందించింది. "ఫేమస్ కావడం కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. దీనిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. నా లీగల్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటాను" అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ మన్సూర్ ఖాన్ కూడా ఈ విషయంపై స్పందించాడు.
ఖండించిన మన్సూర్ అలీ ఖాన్..
త్రిషపై ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలను మన్సూర్ అలీ ఖాన్ ఖండించాడు. తన సహ నటీమణుల గురించి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు బాధగా అనిపిస్తుందని అన్నారు. ఇలాంటి ఆధారం లేని ఆరోపణలు సమాజంపై చెడు ప్రభావం చూపిస్తాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మాజీ రాజకీయ నాయకుడిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన్సూర్ అలీ ఖాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అందరూ ఇది విని ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఆయన చేసింది ఏంటి మరి అని విమర్శిస్తున్నారు. ఆయన కూడా త్రిష గురించి మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తుచేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఇప్పటికైనా తాను చేసిన తప్పును గ్రహించాడు అని మన్సూర్ గురించి చర్చించుకుంటున్నారు.
రీఎంట్రీ తర్వాత బిజీ..
ప్రస్తుతం రీఎంట్రీ తర్వాత త్రిష వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. స్టార్ హీరోలతో జోడీకడుతూ, భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీలో కుందవై పాత్రలో ఆకట్టుకుంది. ఇందులో ఆమె అందం, అభినయంకు అంతా ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘లియో’ సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత త్రిష నటిస్తున్న తెలుగు సినిమా ఇది. ఈ మూవీకి త్రిష కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమె రీఎంట్రీతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్న క్రమంలో ఆమెను ఇలాంటి చేదు అనుభవాలను వెంటాడటంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు.