Manikandan's True Lover Movie Trailer Out: తమిళ నటుడు మణికందన్, దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ కాంబోలో వస్తున్న ఎమోషనల్ లవ్ స్టోరీ ‘ట్రూ లవర్’. ‘బేబీ’ సినిమాను నిర్మించిన SKN, దర్శకుడు మారుతి సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. క్యూట్ బ్యూటీ గౌరి ప్రియ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. లవ్, ఎమోషన్ తో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.
ప్రేమ, గొడవలు, బ్రేకప్!
ఇక ‘ట్రూ లవర్’ చిత్రంలో అరుణ్ పాత్రలో మణికందన్, దివ్య పాత్రలో శ్రీ గౌరి ప్రియ నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ, గొడవలు, బ్రేకప్ ను అద్భుతంగా చూపించారు దర్శకుడు. గొడవలు పడినా మళ్లీ కలుస్తుంటారు. అయితే, అరుణ్ చిన్న ఉద్యోగం చేయడం, పెద్దగా డబ్బులేకపోవడంతో ఆ అబ్బాయిన ప్రేమిస్తున్నానని ఇంట్లో చెప్పేందుకు దివ్య ఆలోచిస్తుంది. ఇంతలోనే డబ్బుకు ఇచ్చిన విలువ ప్రేమకు ఇవ్వడం లేదని అరుణ్ అనడంతో ఆమెకు బాగా కోపం వస్తుంది. బాధపడుతుంది. ఈ నేపథ్యంలోనే డబ్బున్న అబ్బాయి మదన్ బ్యాచ్ తో పరిచయం ఏర్పడుతుంది. వారితో స్నేహాన్ని అరుణ్ తట్టుకోలేడు. దివ్యపై మరింత కోప్పడుతాడు. చివరకు దివ్య అరుణ్ తో ప్రేమను కంటిన్యూ చేస్తుందా? ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్ తోనే నిండిపోయింది. మూవీ టేకింగ్ చాలా రియలెస్టిక్ గా కనిపిస్తోంది. సంగీతం కూడా ఆకట్టుకుంటోంది.
‘బేబీ’ మూవీలాగే ‘ట్రూ లవర్’
ఇక ‘ట్రూ లవర్’మూవీ ట్రైలర్ చూస్తున్నంత సేపు గత ఏడాది తెలుగులో విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న ‘బేబీ’ మూవీ గుర్తుకు వస్తుంది. ఈ సినిమాను ఆ సినిమా నిర్మాత SKN సమర్పిస్తుండటంతో దాని ప్రభావం ఈ చిత్రంపై ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే రెండూ దాదాపు ఒకే కథతో రూపొందినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ‘బేబీ’ సినిమాయే గుర్తుకు వస్తుంది. ‘ట్రూ లవర్’ మూవీ వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుక రాబోతోంది. ఈ చిత్రంలో కన్నా రవి, గీత కైలాసం, హరీశ్ కుమార్, నిఖిల శంకర్, రిని, అరుణాచలేశ్వరన్ ఇతర పాత్రల్లో కనిపించారు. సీన్ రోల్డన్ సంగీతం అందించారు. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. భరత్ విక్రమన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నజరేత్ పాసిలియాన్, మేఘేష్ రాజ్ పసిలియాన్, యువరాజ్ గణేషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై SKN, డైరెకర్ మారుతీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
Read Also: తొడలు.. మసాల వడలు - నెటిజన్ కామెంట్‌కు షాకింగ్ రిప్లై ఇచ్చిన హాట్ బ్యూటీ దక్ష