Althaf Salim's Mandakini Streaming On ETV Win: హారర్, కామెడీ, రొమాంటిక్ థ్రిల్లర్స్‌కు ఆదరణ పెరుగుతున్న క్రమంలో ఆడియన్స్‌ కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఓటీటీలు ఆ జోనర్లలోనే కంటెంట్‍ను ఎక్కువగా అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా.. మలయాళంలో హిట్‌గా నిలిచిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'మందాకిని'. ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. 

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్

ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా 'మందాకిని' (Mandakini) తెలుగు వెర్షన్ 'ఈటీవీ విన్'లో (Etv Win) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను పంచుకుంది. ఈ మూవీలో మలయాళ కమెడియన్ అల్తాఫ్ సలీమ్ హీరోగా నటించగా.. అనార్కలి మరికర్, గణపతి ఎస్.పొదువాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి వినోద్ లీలా దర్శకత్వం వహించారు.

Also Read: విక్రమ్ మూవీ 'వీర ధీర శూర'కు షాక్ - సినిమా విడుదలపై నాలుగు వారాలు స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు

ఆ ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్..

గతేడాది మేలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'మందాకిని' మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అందుకుంది. ప్రేమమ్ సినిమాతో కమెడియన్‌గా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్తాఫ్ సలీమ్. మందాకినీ ద్వారా హీరోగా మారాడు. వెరైటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్ ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ ఏంటంటే..

అరుమల్ (అల్తాఫ్ సలీమ్)ను ముగ్గురమ్మాయిలు రిజెక్ట్ చేస్తారు. ఈ క్రమంలో పెద్దలు అతనికి అంబిలి (అనార్కలి మరిక్కర్)ని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఫస్ట్ నైట్ రోజున అరోమల్‌కు మందు తాగమని సలహా ఇస్తారు ఫ్రెండ్స్. దీంతో ధైర్యం కోసం అతను మందు తాగాలని గ్లాస్ సెట్ చేసుకుంటాడు. అయితే, అది పొరపాటున అంబిలి తాగేస్తుంది. దీంతో రచ్చ రచ్చ చేస్తుంది. తనను తన బాయ్ ఫ్రెండ్ వద్దకు తీసుకెళ్లాలంటూ గొడవ చేస్తుంది. దీంతో అరుమల్ షాక్‌కు గురవుతాడు.

తాగిన మత్తులో తన లవ్ ఎఫైర్ గురించి భర్తకు చెబుతూనే తనను సుజీత్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని చెబుతుంది. ఆ తర్వాత రోజు ఈ వ్యవహారం అరుమల్ తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఈ విషయాన్ని వారు అంబిలి పేరెంట్స్‌ను అడగ్గా.. తమ అమ్మాయికి మందు తాగించారంటూ వారు గొడవకు దిగుతారు. అయితే, అరుమల్ ఏం చేశాడు.?, సుజిత్‌పై అంబిలి కుటుంబం ఎలా రివేంజ్ తీర్చుకుంది.? అరుమల్ పేరెంట్స్ ఏం చేశారు.?, అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.