Veera Dheera Sooran: విక్రమ్ మూవీ 'వీర ధీర శూర'కు షాక్ - సినిమా విడుదలపై నాలుగు వారాలు స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు
Veera Dheera Sooran Release Postponed: విక్రమ్ 'వీర ధీర శూర'కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఈ మూవీ రిలీజ్‌ను నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Chiyaan Vikram's Veera Dheera Sooran Release Date Postponed: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) లేటెస్ట్ మూవీ 'వీర ధీర శూరన్' (Veera Dheera Sooran) విడుదల వేళ వివాదాల్లో చిక్కుకుంది. గురువారం ఉదయం థియేటర్లలో విడుదల కావాల్సిన ఉండగా.. మార్నింగ్ షోలపై ముందు స్టే విధించింది. తాజాగా, ఆ స్టేను నాలుగు వారాలకు పొడిగించింది. దీంతో 'వీర ధీర శూర' మూవీ రిలీజ్ వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.
తొలుత మార్నింగ్ షోలే.. కానీ..
'వీర ధీర శూర' మూవీకి ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ భాషల్లో గురువారం రిలీజ్ కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా మార్నింగ్ షోలు రద్దు కాగా.. తాజాగా మరో 4 వారాలు మూవీ రిలీజ్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించినట్లు తెలుస్తోంది. ఓటీటీ హక్కుల విషయంలో ఈ సినిమా లీగల్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
అదే కారణం..
ముంబయికి చెందిన పేరొందిన నిర్మాణ సంస్థ 'B4U'.. 'వీర ధీర శూర'పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ హక్కులను తమకు అమ్ముతామంటూ ఇచ్చిన ఒప్పందాన్ని చిత్ర నిర్మాతలు పక్కన పెట్టారని ఆరోపించింది. చిత్ర నిర్మాణ సంస్థ తమకు శాటిలైట్ హక్కులు విక్రయించిందని.. అయితే, ఒప్పందం ప్రకారం విడుదలకు ముందే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను విక్రయించకూడదని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ మేకర్స్ ఓటీటీ రైట్స్ అమ్మేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు సినిమా రిలీజ్ వాయిదా వేయాలంటూ తీర్పు ఇచ్చింది. దీంతో ఉదయం మార్నింగ్ షోలు రద్దయ్యాయి. అయితే, మార్నింగ్ షోలు రద్దు కావడంతో విక్రమ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ముందే బుక్ చేసుకున్న టికెట్లకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ ఆయా థియేటర్ల యాజమాన్యాలు మెసేజ్‌లు పంపించాయి.
ఉదయం విచారణ తర్వాత సినిమా విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే, ఊహించని విధంగా మూవీ రిలీజ్‌పై 4 వారాలు స్టే విధించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. తీవ్ర నిరాశకు గురైనట్లు కామెంట్స్ చేస్తున్నారు.
దెబ్బ మీద దెబ్బ
ఓవైపు మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'లూసిఫర్ 2' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్న వేళ.. విక్రమ్ 'వీర ధీర శూర 2' మాత్రం వెనుకబడింది. అసలే తెలుగులో మూవీకి అనుకున్నంత బజ్ లేకపోవడం మరో మైనస్. ఈ నేపథ్యంలో రిలీజ్‌పై ఇప్పుడు హైకోర్టు స్టే విధించడంతో మరో షాక్ తగిలినట్లయింది. 'తంగలాన్' తర్వాత విక్రమ్ నుంచి ఈ మూవీ వస్తుండగా.. పార్ట్ 1 విడుదల చేయకుండానే పార్ట్ 2 రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కథలో అందమైన ప్లాష్ బ్యాక్ ఉందని.. దాన్ని పార్ట్ 1లో చూపిస్తామని ఇటీవల విక్రమ్ తెలిపారు.