కమెడియన్ కింద, నటుడిగా పలు సినిమాలు చేశారు రామచంద్ర (Tollywood Actor Ramachandra). మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'వెంకీ'లో పాత్ర ఆయనకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు రామచంద్ర. ఆయన అనారోగ్యం పాలు కావడంతో మంచాన పడ్డారు. విషయం తెలిసి ఆయన ఇంటికి వెళ్లారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj).
రామచంద్రకు మంచు మనోజ్ పరామర్శManchu Manoj meets actor Ramachandra: పక్షవాతం బారిన పడి గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రామచంద్రను కలిసి ధైర్యం చెప్పారు మంచు మనోజ్. ఈ రోజు (సెప్టెంబర్ 2, మంగళవారం) హైదరాబాద్ సిటీలోని రామచంద్ర ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అక్కడ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. రామచంద్ర ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
Also Read: మళ్ళీ వార్తల్లో మృణాల్ ఠాకూర్... అనుష్క మీద కామెంట్స్... మండిపడుతున్న బాలీవుడ్ ఆడియన్స్!
'మిరాయ్'లో మనోజ్ నటనకు రజనీ ప్రశంసManchu Manoj Upcoming Movies: సినిమాలకు వస్తే... 'భైరవం'తో మంచు మనోజ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత తనకు మరో మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని, తన వరకు ఆ సినిమా సక్సెస్ అని ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఈ సెప్టెంబర్ 12న 'మిరాయ్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గరకు వెళ్లి ఆయనకు 'మిరాయ్' ట్రైలర్ చూపించారు మనోజ్. ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నారు.
Also Read: అషు రెడ్డి ఒంటిపై పచ్చబొట్టు... పవన్ కళ్యాణ్ టాటూను చూపించిన బిగ్ బాస్ బ్యూటీ