Manchu Manoj Review On Kannappa: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా... ఈ మూవీ చూసిన మంచు మనోజ్ మూవీపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో సినిమా చూసిన తర్వాత ఆయన మీడియాతో రివ్యూ పంచుకున్నారు.

అన్న ఇంత బాగా చేస్తారనుకోలేదు

'కన్నప్ప' మూవీ చాలా బాగుందని... తాను అనుకున్న దాని కంటే వెయ్యి రెట్లు బాగా వచ్చిందని చెప్పారు మంచు మనోజ్. 'సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు అదిరిపోయింది. ప్రభాస్ ఎంట్రీ తర్వాత మూవీ వేరే స్థాయికి వెళ్లింది. అన్న కూడా ఇంత బాగా చేస్తారని అసలు ఊహించలేదు. మోహన్ బాబు గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన అదరగొట్టేశారు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. మీ హార్డ్ వర్క్‌కు తగిన రిజల్ట్ దక్కాలని ప్రార్థిస్తున్నా. పెట్టిన డబ్బు రెట్టింపుగా తిరిగి రావాలని కోరుకుంటున్నా.' అని తెలిపారు. సినిమాలో కొన్ని సీన్స్ చూసి ఎమోషన్ అయ్యానని... క్లైమాక్స్ అదిరిపోయిందని అన్నారు. 

Also Read: 'కన్నప్ప' రివ్యూ: 'బాహుబలి' రేంజ్‌లో ట్రై చేసిన విష్ణు మంచు... ప్రభాస్ క్యారెక్టర్ సూపర్, మరి సినిమా?

అయితే... 'కన్నప్ప' సక్సెస్ కావాలని కోరుకుంటూ మనోజ్ గురువారం చేసిన ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఆయన... ఎక్కడా కూడా విష్ణు పేరు ప్రస్తావించలేదు. ఫోటోల్లో కూడా పిల్లల ఫోటోలు షేర్ చేశారు తప్ప విష్ణు ఫోటో పెట్టలేదు. తన తండ్రి మోహన్ బాబుతో పాటు మూవీ టీం మొత్తం ఏళ్ల పాటు ఎంతో శ్రమించి ఈ సినిమా చేశారని... బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఆకాంక్షించారు.

మోహన్ బాబు, తనికెళ్ల భరణి, లిటిల్ ఛాంప్స్ అరి, వివి, ఆవ్రామ్ అంటూ అందరి పేర్లు ప్రస్తావించినా... విష్ణు పేరు లేకపోవడంతో ఇంకా ఇద్దరి మధ్య దూరం తగ్గలేదనే చర్చ సోషల్ మీడియాలో సాగింది. తాజాగా... మూవీ చూసిన మనోజ్ 'అన్న ఇంత బాగా చేస్తారనుకోలేదు' అంటూ కామెంట్ చేశారు. మోహన్ బాబు గారి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని... ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అంటూ రివ్యూ ఇవ్వడంపై కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

'కన్నప్ప' అదుర్స్

'కన్నప్ప' స్క్రిప్ట్ నుంచి వీఎఫ్ఎక్స్, ఫైనల్ అవుట్ పుట్ వరకూ విష్ణు మంచు అన్నీ దగ్గరుండీ తానై నడిపించారు. ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమించిన ఆయన... హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆనందంతో ఎమోషనల్‌కు గురయ్యారు. ఈ మూవీకి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా... మోహన్ బాబు నిర్మించారు. తిన్నడిగా మంచు విష్ణు అదరగొట్టగా... ఆయన సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. రుద్రుడిగా ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. మహాదేవశాస్త్రిగా మోహన్ బాబు, కిరాత రోల్‌లో మోహన్ లాల్, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ తమ నటనతో మెప్పించారు.