Manchu Lakshmi Great Words About Pawan Kalyan: 'య‌క్షిణి' ప్ర‌స్తుతం స్టార్ మా లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ ప్ర‌మోష‌న్స్ లో బిజీ బిజీగా ఉన్నారు మంచు లక్ష్మీ. దానికి సంబంధించి వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఆమె ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపు గురించి మాట్లాడారు మంచు ల‌క్ష్మీ. ఆయ‌న గురించి చాలా గొప్ప‌గా చెప్పారు. ల‌క్ష‌ల‌మందికి ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ఫూర్తి అని, డ‌బ్బులు ఉన్నా, యాక్టింగ్ ఉన్నా ప్ర‌జ‌ల కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని అన్నారు. ప‌దేళ్లు తిట్టినా గ‌ట్టిగా నిల‌బ‌డి ఈ రోజు అఖండ విజ‌యం సాధించారు అని అన్నారు. 


ల‌క్ష‌ల‌మందికి స్ఫూర్తి.. 


"రాజ‌కీయాలు, రాజ‌కీయ‌నాయ‌కులు అది ఒక ప్రత్యేక ప్ర‌పంచం. ఒక యాక్ట‌ర్ గా ఉంటూ, అంత‌మంది నిన్ను యాక్ట‌ర్ గా ప్రేమిస్తుంటే, ప‌క్క‌కు పెట్టి రాజ‌కీయాల్లోకి వెళ్లారు. ఆయ‌న‌కు డ‌బ్బులు అవ‌స‌రం లేదు, ఆయ‌న‌కు ఫేమ్ అవ‌స‌రం లేదు. నిజానికి ఆయ‌న ఫేమ్ ని వేరేవాళ్లు వాడుకుంటారు. పాలిటిక్స్ అంటేనే మంచి చేసినా కూడా చెడు చేసిన‌ట్లు చెప్తారు. అవ‌న్నీ నిల‌దొక్కుకుని ఈ రోజు ఇక్క‌డికి వ‌చ్చ‌రాంటే మాములు విష‌యం కాదు. థ్యాంక్ గాడ్ ఆయ‌న ఎక్క‌డా వ‌దిలేయ‌లేదు. ఎంతోమందికి ఆయ‌న స్పూర్తిగా నిలిచారు. ఆయ‌న‌కు ఎందుకు నేను వెయిటేజ్ ఇస్తాను అంటే జ‌నాల్ని వ‌దిలిపెట్ట‌రు ఆయ‌న‌. జ‌నాల‌కి నేను ఎందుకు చేయాలి అని అనుకోరు. జ‌గ‌న్ కూడా ఫీల్ అవుతుండొచ్చు ఇన్ని ప‌థ‌కాలు ఇచ్చాను. ఇన్ని ఫ్రీగా ఇచ్చాను అయినా న‌న్ను ఓడించారు అని. ఐదేళ్ల‌కే ఆయ‌నకు అలా అయ్యింది. ప‌దేళ్లు అయినా అనుకోవ‌చ్చు. ఆయ‌న కూడా బాధ‌ప‌డుతుండొచ్చు. కానీ, వాళ్లంతా రాజ‌కీయ‌ నాయ‌కులు. కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ నిల‌బ‌డ్డారు. ఆయ‌న్ని ఎన్ని తిట్టినా, ఎన్ని మాట‌ల అన్నా అలానే నిల‌బ‌డ్డారు. ఆయ‌నకు వ‌చ్చిన విజ‌యం నిజంగా ఎంతో స్పూర్తిదాయ‌కం. నేను ఎప్పుడూ ప‌బ్లిక్ గా నా ఒపినియ‌న్ చెప్ప‌లేదు. ఆయ‌న మోటివేష‌న్, నిల‌బ‌డ్డ విధానం, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఎన్నో ల‌క్ష‌ల‌మందిలో స్ఫూర్తి నింపాడు. చాలా గ‌ర్వంగా అనిపిస్తుంది ఆయ‌న్ని చూస్తుంటే" అని ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చాలా స్పెష‌ల్ గా చెప్పారు మంచు ల‌క్ష్మీ. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. ఆమెను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.



ప‌దేళ్ల క‌ష్టం.. 


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్  2004లో జ‌న‌సేన పార్టీని స్థాపించారు. ఆ ఏడాది ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీకి ఆయ‌న స‌పోర్ట్ చేశారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేశారు. ఆ పార్టీ ఒక్క సీటు మాత్ర‌మే గెలిచింది. పోటీ చేసిన రెండు చోట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓడిపోయారు. కానీ, ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024లో ఎన్డీఏ కూట‌మిగా పోటీ చేసి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌మ పార్టీ పోటీ చేసిన 21 సీట్ల‌లో గెలిపొందారు. 


ఎన్నో మాట‌లు.. 


పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ పదేళ్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న్ని ప‌ర్స‌న‌ల్ గా అటాక్ చేశారు. ప్యాకేజ్ స్టార్ అన్నారు. మూడు పెళ్లిల గురించి ప్ర‌స్తావించారు. ద‌త్త‌పుత్రుడు అని విమ‌ర్శించారు. కానీ, ఎక్క‌డా త‌గ్గ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అలానే రాజ‌కీయాల్లో నిల‌బ‌డి ముందుకు వెళ్లారు. ఇప్పుడు స‌క్సెస్ ని మూట‌క‌ట్టుకున్నారు.    


Also Read: నటి పూనమ్‌ కౌర్‌ సంచలన కామెంట్స్‌ - ఏపీ రాజకీయాలను ఉద్దేశించేనా? ఆ ట్వీట్‌ అర్థమేంటి...