Actress Poonam Kaur Sensational Comments: టాలీవుడ్‌ నటి పూనమ్‌ కౌర్‌ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతకాలంగా ఆమె వెండితెరపై కనిపించడం లేదు. సినిమాలకు దూరమైన ఆమె అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది. వీలు చిక్కినప్పుడల్లా పోస్ట్స్‌ పెడుతుంది. ముఖ్యంగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఉద్దేశిస్తూ పరోక్ష కామెంట్స్‌ చేస్తుంది. ఆయనకు సంబంధించిన ఎలాంటి అంశమైన తనస్టైల్లో రియాక్ట్‌ అవుతుంది. అలా పూనమ్‌ తరచూ వార్తల్లో నిలుస్తుంది.


ఇటీవల ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆమె ఇన్‌డైరెక్ట్‌ కామెంట్‌ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ గెలుపు గురించి స్పందించలేదు. కానీ, 'వై నాట్‌ 175' అంటూ సటైరికల్ కామెంట్స్‌ చేసింది. ఇది ఎవరిని ఉద్దేశించి చేసిందో అర్థంకాక అంతా డైలామాలో పడ్డారు. తాజాగా మరోసారి ఏపీ రాజకీయాలపై సంచలన కామెంట్స్‌ చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీలో దిగి ఘనవిజయం సాధించాయి. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీని చిత్తుచిత్తుగా ఓడించి అధికారం చేజిక్కించుకుంది.  ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు నిన్న శాసనసభలో ప్రమాణం స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 






అయితే వారి అసెంబ్లీ లో వారి ప్రమాణ స్వీకారం అనంతరం పూనమ్ కౌర్‌ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్‌ చేసింది. పూనమ్ కౌర్‌ తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చింది."కుట్రపూరితమైన మోసంతో గెలవడం కంటే.. ఒక యోధుడిగా పోరాడి ఓడిపోవడమే మేలు" అంటూ సంచలన కామెంట్స్‌ చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంలను ట్యాంపర్‌, హ్యాక్‌ చేశారంటూ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ మీడియాల్లోనూ రకరకాలుగా కథనాలు వెలువడుతున్నారు. ఈ తరుణంలో పూనమ్‌ ఇలాంటి కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఆమె ట్వీట్‌ ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో చూడాలి.



ఇప్పటికే తన వ్యాఖ్యలపై పవన్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ మండిపడుతూ కామెంట్స్‌ రూపంలో ఆమెకు చురకలు అట్టిస్తున్నారు. కాగా మాయజాలం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది పూనమ్ కౌర్‌.ఈ సినిమాలో తన అందం, అభినయంతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, నిక్కి అండ్‌ నీరజ్‌, గగనం వంటి సినిమాల్లో కీ రోల్స్‌ పోషించింది. చివరిగా నాతిచరామి (2022) సినిమాలో నటించిన ఆమె ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం రాజకీయాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ  జోడో యాత్రలో ఆయనతో కలిసి నడిచిన ఫోటోలు వైరల్‌గా మారాయి.


Also Read: క్రేజీ అప్‌డేట్‌, భారతీయుడు 2 ట్రైలర్‌ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్‌ - ఎప్పుడంటే..