Bharateeyudu 2 Trailer Release Update: లోకనాయకుడు కమల్‌ హాసన్‌, లెజెండరి డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'భారతీయుడు 2'.  వీరిద్దరి కాంబో అనగానే ఆడియన్స్‌లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. లైకా ప్రొడక్షన్‌లో రూపొందిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు షూటింగ్‌ పూర్తి చేసుకుంది. జూలై 12న మూవీని రిలీజ్‌ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. కానీ భారతీయుడు నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ రావడం లేదు.


కమల్‌ లుక్‌ పోస్టర్స్‌, ఫస్ట్‌ సింగిల్‌ తప్పితే ఈ చిత్రం నుంచి చెప్పుకోదగ్గ అప్‌డేట్స్‌ లేవు. వచ్చిన అప్‌డేట్స్ కూడా‌ ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో పెద్దగా బజ్‌ కనిపించడం లేదు. ఈ క్రమంలో భారతీయుడు 2 నుంచి ఇప్పుడు ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. భారతీయుడు 2 ట్రైలర్‌ రిలీజ్‌కు మేకర్స సన్నాహాలు చేస్తున్నారట. ఇక రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుంటంతో ఇక ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేస్తున్నారట. ఇందుల భాగం ముంబై ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్‌.


ట్రైలర్ రిలీజ్ డేట్..


ఈ నెల 25న ఈ ఈవెంట్‌కి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ట్రైలర్‌ కట్‌ వర్క్‌ కూడా పూర్తయినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. దాదాపు ట్రైలర్‌ 2 నిమిషాలు 36 సెకన్ల నిడివి ఉందని, ట్రైలర్‌ సెన్సార్‌ పనులు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక ఈ అప్‌డేట్‌ చూసి ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. కానీ దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా భారతీయుడు 2లో కాజల్‌ అగర్వాల్‌, హీరో సిద్ధార్థ్‌,రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు కీలక పాత్ర పోషించారు. ఇక ఇటీవల చెన్నై ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ వెంట్‌ డైరెక్టర్‌ శంకర్‌ షాకింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.


ఈ సినిమాకు మూడో పార్ట్‌ కూడా ఉందని, ఇండయన్‌ 2లో కాజల్‌ అగర్వాల్‌ అసలు కనిపించని చెప్పి ట్విస్ట్‌ ఇచ్చారు. దీంతో ఈ మూవీ రకరకాల రూమర్స్‌ వస్తున్నాయి. భారతీయుడు 2లో అసలు కమల్‌ కనిపించరని, ఇది పూర్తి సిద్దార్థ్‌ సినిమా అంటున్నారు. ఇక కమల్‌ క్లైమాక్స్‌లోనే కనిపిస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో క‌మ‌ల్ ఫ్యాన్స్ కాస్త హ‌ర్ట‌య్యారు. కానీ,  మూవీ యూనిట్‌ మాత్రం ఇది పూర్తిగా క‌మ‌ల్ సినిమానే అని చెబుతుంది. ట్రైల‌ర్‌లో మొత్తం సేనాపతి మీద సాగుతుంది, ఆయన క్యారెక్టరైజేషన్‌ క‌మ‌ల్ హాస‌న్ అధిప‌త్యం చూపించ‌బోతున్నాడ‌ని టాక్. క‌మ‌ల్ గెట‌ప్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌, కాన్‌ఫ్లిక్ట్ మొత్తం ట్రైల‌ర్‌లో రివీల్ చేయ‌బోతున్నార‌ని టాక్‌. 



కాగా 1996లో శంకర్‌-కమల్‌ వచ్చిన భారతీయుడు ఈ సినిమాకు సీక్వెల్‌ ఇది. తమిళ్‌,తెలుగు, హిందీ భాషల్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద ఊహించని కలెక్షన్స్‌ చేసి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. అప్పట్లోనే ఈ చిత్రం రూ.50 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. అప్పట్లో ఎక్కడ చూసిన భారతీయుడు బజే కనిపించింది. దాదాపు 28 ఏళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌ ప్రకటించారు. ప్రకటనతో భారతీయుడు 2పై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది.


Also Read: ఎన్ని యుగాలైనా.. ఎన్ని అవకాశాలు ఇచ్చిన మనిషి మారడు - గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న 'కల్కి' రిలీజ్‌ ట్రైలర్‌