Manchu Lakshmi Got Emotional In Teach For Change Event: ప్రముఖ నటి మంచు లక్ష్మి ఓ ఈవెంట్‌లో ఎమోషనల్ అయ్యారు. ఆమె నిర్వహిస్తోన్న 'టీచ్ ఫర్ ఛేంజ్' కార్యక్రమంలో నటుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక తాజాగా పాల్గొన్నారు. సోదరికి సర్ ప్రైజ్ ఇద్దామని మనోజ్ యత్నించగా.. వారిని చూసి మంచు లక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్నారు.

మనోజ్‌ను హత్తుకుంటూ ఎమోషనల్

మంచు లక్ష్మిని సడన్‌గా పిలిచి సర్ ప్రైజ్ ఇచ్చారు మనోజ్. ఆయన్ను చూసిన వెంటనే లక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. మనోజ్‌ను ప్రేమగా హత్తుకుంటూ కింద కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసి పక్కనే ఉన్న మౌనిక ఆమెను ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనలు అందించాలనే లక్ష్యంతో నటి మంచు లక్ష్మి 'టీచ్ ఫర్ ఛేంజ్' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా ప్రతీ ఏడాది సెలబ్రిటీ ఫ్యాషన్ షోను నిర్వహిస్తుంటారు. శనివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లోనే మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక పాల్గొని ఆమెకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ ఈవెంట్‌లో నటీమణులు రియా చక్రవర్తి, కేతికా శర్మ, అనసూయ సందడి చేశారు.

Also Read: విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్? - ఆ వార్తల్లో నిజమెంత!

మంచు ఫ్యామిలీ వివాదంతో..

తాజాగా.. మంచు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తన తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణుతో కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్‌కు వివాదం జరిగింది. బహిరంగంగానే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగినట్లు అనిపించినా.. ఇటీవల తన కారు పోయిందని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప బర్త్ డే వేడుకల కోసం తాను జయపుర వెళ్లిన సమయంలో.. తన సోదరుడు మంచు విష్ణు ఇదంతా చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ క్రమంలోనే జల్పల్లిలో మోహన్ బాబు నివాసానికి వెళ్లగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాను ఊర్లో లేనప్పుడు తన వస్తువులు ఎత్తుకెళ్లారని మనోజ్ అన్నారు. తన పెంపుడు కుక్కలు, వస్తువులు ఇంట్లోనే ఉన్నాయని చెప్పారు. ఇంటి గేట్ బయటే కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లోనూ మంచు విష్ణుకు వ్యతిరేకంగా మాట్లాడారు. తమ గొడవ ఆస్తి కోసం కాదని.. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రశ్నించాననే తన గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు వ్యాపింపచేశారని అన్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' పైనా సెటైర్లు వేశారు. 'కన్నప్ప'ను ఏకంగా 'దొంగప్ప' వర్ణిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. తన సినిమా 'భైరవం'కు భయపడే 'కన్నప్ప' రిలీజ్ వాయిదా వేశారని అన్నారు.