Anupama Parameswaran Love With Dhruv Vikram Rumours Gone Viral: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).. తన అందం, అభినయం, నటనతో అచ్చమైన తెలుగమ్మాయిలా తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేశారు. ఈ కేరళ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో కుమారునితో లవ్‌లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ముద్దు ఫోటో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో (Dhruv Vikram) అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ కనిపించగా.. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని స్థానిక పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. దీంతో కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఫోటో వీరిద్దరూ కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'బైసన్'కు సంబంధించింది అంటూ కొందరు నెటిజన్లు అంటున్నారు.
Also Read: బాలకృష్ణ 'అఖండ 2'పై కీలక అప్ డేట్ - సినిమాకే హైలెట్‌గా యాక్షన్ సీన్స్, ఆ సన్నివేశం కోసం భారీ సెట్?
అదంతా తప్పుడు ప్రచారం
అయితే, అదంతా తప్పుడు ప్రచారం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అనుపమ, ధ్రువ్ విక్రమ్ కలిసి 'బైసన్' సినిమాలో నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ధ్రువ్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీలో అనుపమ ఆయన ప్రియురాలి పాత్రలో నటిస్తున్నారు. ఈ ఫోటోలు సైతం ఆ చిత్రానికి సంబంధించినవే అని అంటున్నారు. ఈ వార్తలపై అటు అనుపమ కానీ.. ఇటు ధ్రువ్ నుంచి కానీ ఎలాంటి స్పందనా లేదు.
వరుస ప్రాజెక్టులతో బిజీగా..
కేరళకు చెందిన అనుపమ.. మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీలోనే తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ 'అ ఆ'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమె వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకున్నారు. శతమానం భవతి, హలో గురూ ప్రేమ కోసమే, ఉన్నది ఒకటే జిందగీ సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు.
నిఖిల్ 'కార్తికేయ 2' సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. గతేడాది సిద్ధు జొన్నలగడ్డ సరసన 'టిల్లు స్క్వేర్'లో నటించి మెప్పించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రామ్ చరణ్ 'రంగస్థలం'లో ఆమెనే హీరోయిన్ అనుకున్నా.. చివరి నిమిషంలో అవకాశం చేజారినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా నటుడు ప్రదీప్ రంగనాథన్ మూవీ 'డ్రాగన్'లోనూ నటించారు. ప్రస్తుతం అనుపమ తెలుగులో 'పరదా' సినిమాతో పాటు పలు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు. నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ఇక ధ్రువ్ విక్రమ్ విషయానికొస్తే.. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడిగానే కాకుండా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 'అర్జున్ రెడ్డి' రీమేక్‌గా రూపొందిన 'ఆదిత్య వర్మ' సినిమాతో ధ్రువ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం తండ్రితో కలిసి 'మహాన్' కోసం పని చేశారు. ప్రస్తుతం బైసన్‌లో నటిస్తున్నారు.