Mana Shankara Vara Prasad Garu Run Time Locked : మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక సెన్సార్ బోర్డు స్క్రూటినీ కావాల్సి ఉంది.
రన్ టైం ఎంతంటే?
తాజాగా ఈ మూవీ రన్ టైం ఎంత అనే దానిపై లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది. మొత్తం సినిమా 2 గంటల 38 నిమిషాల రన్ టైం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఎక్కువే అని తెలుస్తుండగా క్లారిటీ రావాల్సి ఉంది. సెన్సార్ తర్వాత రన్ టైం సహా ఇతర వివరాలు మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేయనుంది.
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన మెగాస్టార్ లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వింటేజ్ మెగాస్టార్‌ను చూడబోతున్నట్లు లుక్స్‌ను బట్టే అర్థమవుతోంది. 'మీసాల పిల్ల' సాంగ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ 90 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. దీంతో పాటే 'శశిరేఖ' సాంగ్ కూడా ట్రెండింగ్‌లో నిలిచింది.
Also Read : రాజమౌళి 'వారణాసి' బడ్జెట్ - ప్రియాంక చోప్రా రియాక్షన్... ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా!
చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే విక్టరీ వెంకటేష్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఆయన లుక్ అదిరిపోయింది. కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. మెగా గ్రేస్‌కు తగ్గట్లుగా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. వింటేజ్ మెగాస్టార్‌ను చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
వి