బాక్స్ ఆఫీస్ వద్ద 'దేవర' బీభత్సం ఇంకా కంటిన్యూ అవుతుంది. దుమ్ము రేపే కలెక్షన్లతో లాంగ్ రన్ లోనూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది ఈ పాన్ ఇండియా సినిమా. మొదటి వారంలో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రెండవ వీకెండ్ లో మరోసారి కలెక్షన్ల పరంగా మాస్ జాతర చూపిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే 400 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి, 500 కోట్ల క్లబ్ లో చేరడానికి అతి చేరువలో ఉంది 'దేవర'.
500 కోట్ల క్లబ్ లో 'దేవర'
మ్యాన్ ఆఫ్ మాసేస్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర'. 'జనతా గ్యారేజ్' తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా ఇది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా. హిందీ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించాడు. 'దేవర' మూవీలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలెట్. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ కు పట్టిన దుమ్మును దులిపే రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొట్టింది. ప్రీమియర్ షోలతో కలిపి ఈ సినిమా 170 కోట్లకు పైగా ఓపెనింగ్ రాబట్టింది. ఇక ప్రస్తుతం దసరా సెలవులు కూడా కలిసి రావడంతో దేవర కలెక్షన్ల పరంగా బీభత్సం సృష్టిస్తోంది. రిలీజ్ అయిన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.466 కోట్ల వసూలు సాధించింది ఈ సినిమా. 'దేవర' టీం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
'దేవర' మాస్ జాతర... తెగ్గేదే లే
మరోవైపు 'దేవర' నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 5.8 మిలియన్లను డాలర్ల కలెక్షన్లు కాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. త్వరలోనే 6 మిలియన్ల కలెక్షన్స్ ను చేరుకోనుంది. ఇటువైపు 500 కోట్ల క్లబ్ లో చేరడానికి అతి చేరువలో ఉన్నాడు 'దేవర'. ఇక ప్రస్తుతం 'దేవర' జోరు చూస్తుంటే ఈ మైలురాయిని చేరుకోవడానికి ఎన్నో రోజులు పట్టేలా లేదు. 10వ రోజు ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రూ.6.45 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టింది. అలాగే రూ.10.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో రూ. 114 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన 'దేవర' 10 రోజుల్లోనే ఆ టార్గెట్ ను బ్రేక్ చేసి, నిర్మాతలకు 21 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఇక దసరా సెలవుల్లో మరిన్ని సినిమాలు తెరపైకి రాబోతున్నప్పటికీ ఏ మాత్రం జోష్ తగ్గకుండా 'దేవర' బాక్స్ ఆఫీస్ వద్ద జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. ఇదే జోరు కంటిన్యూ చేస్తే దసరా హాలిడేస్ లో 'దేవర' 600 కోట్ల కలెక్షన్లను అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికైతే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడంతో హీరోతో సహ నిర్మాతలు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.