Mammootty & Kiccha Sudeep follow the footsteps of Mahesh Babu: మామూలుగా 'ఫోన్ పే' చేసినప్పుడు మనకు పేమెంట్ రిసీవ్ చేసుకున్నట్లు స్పీకర్‌లో ఒక లేడీ గొంతు వినిపిస్తుంది. ఇక ఈ మధ్య హిందీలో అయితే, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ వినిపిస్తోంది. అయితే, త్వరలో తెలుగులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ వినిపిస్తుందనే వార్తలు వచ్చాయి. మహేశ్ బాబు ఫోన్‌పేతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు, దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటికి వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆయన బాటలోనే మరికొంతమంది స్టార్స్ నడుస్తున్నారట. వాళ్లు కూడా ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్నారట.
మహేశ్ బాటలోనే మమ్ముట్టి, కిచ్చాసుదీప్..
మహేశ్ బాబు బాటలోనే సౌత్ ఇండియన్ స్టార్స్ మమ్ముట్టి, కిచ్చ సుదీప్ కూడా నడుస్తున్నారట. ఈ ఇద్దరు తమ వాయిస్ ఇచ్చేందుకు ముందుక వచ్చారట. ఈ మేరకు డిజిటల్ పేమెంట్స్ ఫ్లాట్ ఫామ్ 'ఫోన్‌పే'తో ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో వివిధ భాషల్లో సూపర్ స్టార్ట్స్‌ని సంప్రదించి.. వాళ్ల మాతృ భాషలో సదరు యాక్టర్ గొంతు వినిపించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే బాలీవుడ్‌లో బిగ్ బి ఫేమస్ కాబట్టి ఆయన గొంతు నార్త్ ఇండియాలో, తెలుగులో మహేశ్ బాబు, సుదీప్ గొంతు కన్నడలో, మమ్ముట్టి గొంతు మళయాలంలో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. వీళ్లే కాకుండా మరికొంతమంది సౌత్ స్టార్స్ కూడా తమ గొంతును ఫోన్ పే ద్వారా వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఏఐ ద్వారా..
‘ఫోన్ పే’లో ట్రాన్సాక్షన్ పూర్తయ్యిందని హీరో వాయిస్‌లో వినిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే అమౌంట్ మాత్రం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మళ్లీ హీరో వాయిస్‌లోనే థ్యాంక్యూ అని వినిపిస్తుంది. అయితే, మహేశ్ బాబు వాయిస్‌తో ‘థ్యాంక్యూ బాస్’ అని వినిపించనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో "భాయి ఔర్ బెహనో ధన్యవాద్" అనే వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలసిందే. ఇక ‘ఫోన్ పే’ నుండి వచ్చిన ఈ క్రియేటివ్ ఐడియా చాలామందిని ఇంప్రెస్ చేస్తోంది.
రెండేళ్లపాటు దూరంగా..
మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్నారు. దీంతో ఆయనకు రాజమౌళి కొత్త కండిషన్స్ పెట్టారట. రెండేళ్ల పాటు తన లుక్‌ని ఎక్కడా రివీల్ చేయొద్దని ఆయన చెప్పారట. దీంతో రెండేళ్ల పాటు మహేశ్ బాబు ఎలాంటి కొత్త యాడ్స్ చేయరనే టాక్ వినిపిస్తోంది ఫీలిమ్ నగర్‌లో. దీంతో కనీసం వాయిస్ అయినా వినొచ్చు అని అనుకుంటున్నారట ఆయన ఫ్యాన్స్. ఈ సినిమా కోసం మేహేశ్ బాబు బాడీని పూర్తి స్థాయిలో మార్చుకోబోతున్నారు. జిమ్‌లో గంటల తరబడి గడుపుతున్నారు. కఠినమైన డైట్ ప్లాన్ ను కూడా ఫాలో అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
తన ఫిట్ నెస్ కోసం ఏకంగా ఇంటర్నేషనల్ ట్రైనర్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారట. మహేష్ బాబు బాడీ కాకుండా, లుక్స్ కూడా ఈ సినిమాకు అనుగుణంగా మార్చుతున్నారట రాజమౌళి. తన జుట్టును కూడా సరికొత్తగా చూపించబోతున్నారట. అందుకే, ఆయన లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారట రాజమౌళి. ఇక ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జూన్ నుంచి మొదలు పెట్టాలని భావిస్తున్నారట. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందించనున్నారు. కె ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
Also Read: సమంత ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. మమ్ముట్టితో ఫొటో దిగి మురిసిపోయిన బ్యూటీ