Malaika Arora: నవరాత్రి వేడుకలో మలైకా... తిట్టిపోస్తున్న నెటిజన్లు - కారణం ఏంటో తెలుసా?

తండ్రి అనిల్ అరోరా మరణం తర్వాత మలైకా అరోరా తొలిసారి బయట కనిపించింది. కల్యాణ్ రామన్ ఫ్యామిలీ నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో ఆమె పాల్గొన్నది. అయితే... ఆవిడను నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.

Continues below advertisement

Malaika Arora Gets Trolled: ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కేరళలోని త్రిసూర్ లో కల్యాణ్ జువెలరీ సంస్థ అధినేత కల్యాణ్ రామ్ అట్టహాసంగా దేవీ నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో దేశంలో పలు సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు పాల్గొన్నారు. రష్మిక మందన్న, మలైకా అరోరా, సైఫ్ అలీ ఖాన్, శిల్పాశెట్టి, నాగ చైతన్యతో పాటు పలువు స్టార్స్ వెళ్లి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే... ఈ వేడుకలో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమె తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే అమ్మవారి దగ్గరకి రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ సంతాప దినాలు పూర్తిగా కాకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని కొందరు నెటిజన్లు విమర్శించారు.

Continues below advertisement

"మీ తండ్రి రీసెంట్ గానే చనిపోయారు. అప్పుడే సంతాప దినాలు పూర్తయ్యాయా?” అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... “ఆమె ఎలాంటి బాధ లేకుండా రెడ్ కార్పెట్ మీద ఉల్లాసంగా వెళ్తోంది” అని మరొకరు కామెంట్ పెట్టారు. “ఇంట్లో వ్యక్తిని కోల్పోయిన  కొద్ది రోజుల్లోనే పండుగలో పాల్గొనడం నిజంగా అవమానకరం” అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.   

మలైకాకు అభిమానుల సపోర్టు

మలైకా అరోరాను కొంత మంది నెటిజన్లు టార్గెట్ చేయడాన్ని ఆమె అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సెలబ్రిటీల విషయంలో పట్టు విడుపులు అనేవి ఉండాలంటున్నారు. "మన కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు 15, 20 రోజుల తర్వాత తిరిగి మన పని మనం చేసుకుంటాం. అలాగే ఆమె కూడా తన పని తాను చేసుకుంటుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "మనిషిని కోల్పోయినంత మాత్రాన రోజుల తరబడి ఏడుస్తూ కూర్చోవాలా? ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి వచ్చి ఏడుస్తూ కనిపించాలా? ప్రజలు త్వరగా తీర్పులు ఇవ్వడం మానుకోవాలి” అంటూ మరో నెటిజన్ సీరియస్ అయ్యాడు. “సెలబ్రిటీలను అన్ని విషయాల్లో బూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఆమె ఓవైపు బాధపడుతూనే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది” అంటూ ఇంకొకకరు సపోర్టు చేశారు.

Also Readసెట్స్‌లో ఏనుగుల బీభత్సం... కేరళలో విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ క్యాన్సిల్

సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న మలైకా అరోరా

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మలైకా ఆరోరా బంగారు అంచుతో కూడిన చక్కటి ఐవరీ శారీని ధరించింది. మల్టీ లేయర్ పెరల్ నెక్లెస్, పచ్చల లాకెట్ సహా సంప్రదాయ ఆభరణాలు ధరించి ఆకట్టుకుంది. పట్టు పల్లును చేతిలో పట్టుకుని రెడ్ కార్పెట్ మీద నడించింది. అనంతరం ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు అక్టోబర్ 23న మలైకా తన 51వ పుట్టిన రోజు జరుపుకోనుంది.  రీసెంట్ గా ఆమె తండ్రి అనిల్ ఆరోరా తన అపార్ట్ మెంట్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన చనిపోయిన తర్వాత తొలిసారి ఆమె బయటకు వచ్చింది. అమ్మవారి వేడుకలో పాల్గొన్నది.

Read Also:విజయ్ 69వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ప్రేమలు బ్యూటీ మంచి ఆఫరే పట్టిందిగా

Continues below advertisement