Bharateeyudu 2 New Poster Kamal Haasan returns as Senapathy: లోకనాయకుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ 'ఇండియన్ 2'(భారతీయుడు 2). డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ జాన్‌లో విడుదల కానుంది. దీనిపై ఇటీవల ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన ఈ మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. ఇక ఎంతోకాలంగా అప్‌డేట్ కోసం చూస్తున్న ఈ మూవీ లవర్స్ అంతా రిలీజ్ అప్‌డేట్ రాగానే ఖుష్ అయ్యారు. ఫైనల్ మూవీ విడుదలపై క్లారిటీ వచ్చిందంటూ సంబరపడ్డారు. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్‌డట్ వదిలారు.
'సేనాపతి' వచ్చేస్తున్నాడు..
Kamal Haasan Back As Senapathy: తమిళ నూతన సంవత్సరం పురస్కరించుకుని 'ఇండియన్ 2' కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ తమిళ ఆడియన్స్‌కి నూతన సంవ్సతరం శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో కమల్ హాసన్ డ్యూమెల్ షేడ్స్‌లో కనిపించాడు. ఒకటి సాధారణ మనిషిలా తెల్ల షర్ట్ ధరించి ఉన్నాడు. మరో షెడ్‌లో పోలీసు అధికారికా కనిపించాడు. ఇక రెండింటిలో ఆయన సీరియస్‌గా చూస్తూ అవినీతి పరులకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా కనిపించాడు. ప్రస్తుతం ఈ కొత్త పోస్టర్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. అలాగే ఈ పోస్ట్‌కి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. సేనాపతి వచ్చేస్తున్నాడు. 'ఇండియన్ 2'లో జీరో టోలర్స్‌ని పునరుత్థానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. జూన్ 2024 నుంచి ఈ క్రేజీ సీక్వెల్ కోసం సిద్ధంగా ఉండండి. ఎక్కడ అన్యాయం జరిగినా రెడ్ అలర్ట్‌గా పరిగణిచండి" అంటూ మూవీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ అనే విషయం తెలిసిందే.
రిలీజ్ డేట్ పై నో క్లారిటీ
Indian 2 Hits Theaters in June: శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా అప్పుట్లో సంచలన విజయం సాధించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం తీసుకునే అధికారులన దండించే భారతీయ పౌరుడిగా కమల్ హాసన్ అద్భుతంగా నటించారు. అప్పుడు ద్విపాత్రాభినయం చేసిన ఆయన ఇండియన్ 2లోనూ రెండు షెడ్స్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించి లుక్స్‌నే మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్ సేనాపతిగా ఓ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారనేది పోస్టర్స్ చూస్తే అర్థమైపోతుంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే 'భారతీయుడు' సెంటిమెంట్‌నే కంటిన్యూ చేస్తూ 'ఇండియన్ 2' మే 9న మేకర్స్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఎలక్షన్ కారణంగా మే నెలలో రిలీజ్ కాబోయే పెద్ద సినిమాలన్నింటిని వాయిదా వేసుకున్నారు. ప్రభాస్ 'కల్కి' కూడా మే 29న రిలీజ్ అన్నారు. అదీ కూడా వాయిదా పడింది. ఇక 'భారతీయుడు 2' జూన్‌లో విడుదల చేస్తున్న చెప్పిన మూవీ టీం ఖచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేదు. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.