Gun Shots Fired Outside Salman Khan House: బి-టౌన్‌లో కాల్పుల కలకలం రేగింది. బాలీవుడ్‌ 'భాయిజాన్‌' సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ఇంటిపై దుండగులు కాల్పులకు తెగబడిన ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బౌక్‌పై వచ్చి సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపైకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు (Gun Shot Fired).  కాగా ముంబై బాంద్రాలోని సల్మాన్‌ ఖాన్‌ నివాసం గ్యాలెక్సీ అపార్ట్‌మెంట్స్‌ ముందు ఆదివారం తెల్లవారుజామున 4:51 గంటలకు గాల్లో కాల్పులు జరిపారు. తొలుత మూడు రౌండ్ల బుల్లెట్లు, ఆపై నాలుగు రౌండ్ల ఇలా రెండు సార్లు సల్మాన్‌ ఇంటి ముందుకు గాల్లో కాల్పులు జరిపారు.


దీంతో అప్రమత్తమైన పోలీసులు సల్మాన్‌ ఇంటి ముందు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సల్మాన్‌పై కాల్పులు ఎవరి జరిపారు, ఎందుకు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ దిశగా ముంబై పోలీసులు విచారణ చేపడతారు. ఇప్పటికే ముంబై క్రైం బ్రాంచ్‌, ఫారెన్సిక్‌ నిపుణులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ సంఘటన సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


గతంలోనూ సల్మాన్ కు బెదిరింపులు 


కాగా గతేడాది సల్మాన్‌ చంపేస్తామంటూ ఆయన ఆఫీకి సుఈమెయిల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సల్మాన్‌కు చంపేస్తామంటూ గ్యాంగ్‌స్టర్స్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డి బ్రార్‌లు బహిరంగంగానే హెచ్చరించారు. అంతేకాదు పలుమార్లు సల్మాన్‌ ఇంటి ముందు బిష్ణోయ్‌ గ్యాంగ్‌స్టర్‌ సభ్యులు రెక్కీ కూడా నిర్వహించగా పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌ పట్టుబడ్డారు. ఆ టైంలో కూడా ఎప్పటికైనా సల్మాన్‌ మట్టుబెడతామంటూ ఈ గ్యాంగ్‌స్టర్‌ గ్యాంగ్‌ తరచూ హెచ్చరిస్తునే ఉన్నారు. అంతేకాదు సల్మాన్‌పై దాడి చేసేందుకు ఈ గ్యాంగ్‌స్టర్లు తమ షూటర్లను సీక్రెట్‌ ముంబైకి కూడా పంపినట్టు తెలుస్తోంది.



ఇక గ్యాంగ్‌స్టర్స్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డి బ్రార్‌లు టార్గెట్‌ చేసిన వారిలో సల్మాన్‌ ఖాన్‌ ఉన్నట్టు ఎన్‌ఐఏ వెల్లడించింది. అంతేకాదు కృష్ణజింకను వెటాడి చంపిన కేసు విచారణలో సల్మాన్‌ వ్యాఖ్యలు తమ మనోభవాలను దెబ్బతీశాయి గతంలో బిష్ణోయ్‌ పేర్కొన్నాడు. ఆ తర్వాత వరుసగా పలుమార్లు సల్మాన్‌ దాడి యత్నాలు జరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు 'ఎక్స్‌' గ్రేడ్‌ భద్రత నుంచి Y+గా అప్‌గ్రేడ్‌ చేసింది. అలాగే ఆయనకు గన్‌ లైనెన్స్ కూడా మంజురైంది. వ్యక్తిగత ఆయుధాన్ని కూడా నిత్యం వెంట తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతిని కూడా ఇచ్చారు. అలాగే సల్మాన్‌కు ఇద్దరు సాయుధ గార్డులు నిత్మం భద్రతగా ఉంటున్నారు. 


Also Read: తరుణ్ అందుకే సినిమాలు చేయడం లేదు, మోహన్ బాబు ఫ్యామిలీ కూడా కష్టపడుతోంది: ఎంఎస్ నారాయణ కొడుకు విక్ర‌మ్