The Voyeurs 2021: మన గురించి మనం ఆలోచించకుండా, ఎదుటి వారి జీవితాల్లోకి ఎప్పుడు తొంగి చూస్తామో? అప్పుడే అసలు కష్టాలు మొదలవుతాయి. కుటుంబం నిట్ట నిలువున పతనం అవుతుంది. ఎదుటి వారికి ఏదో చేయాలనే తపనలో సొంత కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టివేసుకునే పరిస్థితి తలెత్తుతుంది. ఓ మహిళ ఎదుటి ఫ్యామిలీ విషయంలో మితిమీరిన జోక్యం చేసుకోవడం వల్ల ఎలాంటి ఘోరం జరిగిందో చూపించే చిత్రమే ‘ది వోయర్స్’. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మైఖేల్ మోహన్ దర్శకత్వం వహించారు. ఈ అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్‌ను మాంట్రియల్, క్యూబెక్, కెనడాలో తెరకెక్కించారు. సిడ్నీ స్వీనీ, జస్టిస్ స్మిత్, బెన్ హార్డీ, నటాషా లియు బోర్డిజో ప్రధాన పాత్రలు పోషించారు. గ్రెగ్ గిల్రెత్, ఆడమ్ హెండ్రిక్స్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో దీన్ని తెలుగు సబ్ టైటిల్స్‌తో చూడవచ్చు. (Spoiler Alert: కథలో ట్విస్టులన్నీ రివీల్ చేశాం.)


ఇంతకీ ‘ది వోయర్స్’ కథ ఏంటంటే?


పిప్పా(సిడ్నీ స్వీనీ, థామస్(జస్టిస్ స్మిత్) భార్యా భర్తలు. వీరిద్దరు కొత్తగా అపార్ట్ మెంట్ లోకి వస్తారు. వారికి అపార్ట్ మెంట్ కు ఎదురుగా ఉన్న ఇంట్లో మరో జంట ఉంటుంది. ఆమె భర్త ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. పిప్పా వాళ్ల ఇంట్లో నుంచి చూస్తే పొరుగువారు ఇంట్లో ఏం చేస్తున్నారు క్లియర్ గా కనిపిస్తుంది. మోడల్స్ ను ఫోటోలు తీయడం నుంచి వారితో ఇంటిమేట్ అవడం వరకు అన్నీ కనిపిస్తుంటాయి.


పిప్పా ట్రైనీ ఆప్టోమెట్రిస్ట్‌ గా పని చేస్తుంది. పొరుగింటిలో జరిగేవి చూసేందుకు ఆ జంట ఆసక్తి చూపిస్తారు. దీంతో కిటికీ వద్ద బైనాక్యులర్ ఏర్పాటు చేసుకుంటారు. పొరుగు ఇంట్లోని వాళ్లు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని పిప్పా, థామస్ చూస్తుంటారు. అయితే, తన భార్య లేని సమయంలో పొరుగు వ్యక్తి, ఇంటికి మోడల్స్ ను పిలిచి వారిని ఫోటోలు తీస్తారు. ఫోటో షూట్ అయిపోగానే, వారితో ఇంటిమేట్ అవుతాడు. ఈ విషయాన్ని గమనించిన పిప్పా, అతడు తప్పు చేస్తున్నాడు అని భావిస్తుంది. అదే సమయంలో పొరుగువారి ఇంట్లో పార్టీ జరుగుతుంది. ఆ రోజు తన భర్త మరో అమ్మాయితో చనువుగా ఉండటాన్ని గమనించి నిలదీస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె కళ్లజోడు విరిగిపోతుంది.


మరుసటి రోజు పిప్పా వాళ్ల ఐ స్టోర్‌కు వెళ్తుంది. పొరుగింటి ఆవిడ పేరు జూలియా అని తెలుసుకుంటుంది. పిప్పా ఆమెకు కంటి పరీక్షలు చేసి కొత్త కళ్లజోడును ఆర్డర్ చేస్తుంది. అయితే, జూలియా భర్త ఇతర అమ్మాయిలతో ఇంటిమేట్ కావడం గురించి చెప్పాలి అనుకుంటుంది. కానీ, పిప్పా భర్త థామస్ పొరుగు వారి గురించి ఆలోచించడం మానేయలని చెప్తాడు. ఆ తర్వాత పిప్పా, జూలియా స్పాలో కలుస్తారు. అప్పుడు తన భర్త సెబ్ అని, ఆయన ఫోటోగ్రాఫర్ అని పిప్పాతో చెప్తుంది. ఆ రోజు రాత్రి జూలియాకు పిప్పా ఓ మెసేజ్ పంపిస్తుంది. నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు. కావాలంటే డస్ట్ బిన్ లో వాడి పడేసిన కండోమ్ ఉంటుంది చూడమని చెప్తుంది. జూలియా వెళ్లి చూడగానే నిజంగానే ఉంటుంది. దీంతో ఓ కత్తి తీసుకుని భర్తను చంపాలి అనుకుంటుంది. కానీ, చంపదు. ఈ విషయాన్ని పిప్పా, థామస్ చూస్తారు. పిప్పా వ్యవహారంపై థామస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మరుసటి రోజు జూలియా కత్తితో తన గొంతు కోసుకుని చనిపోతుంది. థామస్.. జూలియా మరణానికి పిప్పా కారణమని భావించి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు.     


హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరణ


ఒంటరిగా ఉన్నా పిప్పా, సెబ్ ని చూస్తుంటుంది. ఓ రోజు సాయంత్రం దగ్గరలోని పబ్ కు వెళ్తుంది పిప్పా, సెబ్ కూడా అదే పబ్ కు వెళ్లి ఆమె పక్కన కూర్చుంటాడు. తాను ఎంత మందితో ఇంటిమేట్ అయినా, జూలియా అంటేనే తనకు ఇష్టం అని చెప్తాడు. తాను తప్పు చేశానని పిప్పా బాధపడుతుంది. అదే సమయంలో ఆమెను ఫోటోలు తీస్తానని సెబ్ చెప్పడంతో అతడితో కలిసి వెళ్తుంది. ఆమెను నగ్నంగా ఫోటో షూట్ చేస్తాడు. చివరకు ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. (ఈ సన్నివేశం వచ్చేప్పుడు జాగ్రత్త. పెద్దలకు మాత్రమే).


అదే సమయంలో తన అపార్ట్ మెంట్ కు వచ్చిన థామస్, తన భార్య సెబ్ తో అలా ఉండగా చూస్తాడు. బాగా హర్ట్ అవుతాడు. ఆ తర్వాత తన అపార్ట్ మెంట్ లో ఉరేసుకుని చనిపోతాడు. జరిగిన ఘటన పట్ల చాలా పిప్పా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత పిప్పా, సెబ్ ఫోటో ఎగ్జిబిషన్ కు వెళ్తుంది. అక్కడే ఉన్న జూలియాను చూసి పిప్పా షాక్ అవుతుంది. అయితే, పిప్పా, థామస్ రెంటుకు తీసుకున్న అపార్ట్మెంట్ తమదేనని జూలియా, సెబ్ చెప్తారు.


అంతేకాదు, తమను చూస్తున్న విషయం వారికి తెలుసు అని వెల్లడిస్తారు. వారిని ఫోటోలు తీయడానికే తాము తప్పు చేస్తున్నట్లు వారిలో భ్రమ కలిగించినట్లు చెప్తాడు. వారి మాటలు విని, పిప్పా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చే సరికి జూలియా, సెబ్ కు ఓ వైన్ బాటిల్ ను బహుమతిగా వస్తుంది. వారు వైన్ తాగుతుండగా, పిప్పా వారి ప్రింటర్ కు ఓ మెసేజ్ పంపిస్తుంది. థామస్ ఆత్మహత్య చేసుకోలేదని తనకు తెలుసు అని అందులో రాస్తుంది.


పిప్పా సెబ్‌తో ఇంటిమేట్ అవుతుండగా, జూలియా.. థామస్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి అతడిని హత్య చేస్తుంది. ఆ తర్వాత అతడికి ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు క్రియేట్ చేస్తుంది. ఈ విషయం పిప్పాకు తెలియడంతో ఆమెను పట్టుకునేందుకు జూలియా, సెబ్ ప్రయత్నిస్తారు. కానీ, వైన్ తాగడం వల్ల మత్తులో ఉంటారు. ఆ వైన్ బాటిల్‌ను పిప్పానే పంపిస్తుంది. వారు పడిపోగానే లేజర్ లైట్ తో వారి కళ్లు కనిపించకుండా చేస్తుంది. ఇద్దరూ గుడ్డి వాళ్లు అవుతారు. తన భర్త చావుకు కారణం అయిన వాళ్లకు కంటి చూపు లేకుండా చేస్తుంది పిప్పా. దీంతో సినిమా అయిపోతుంది. ఎదుటి వారి జీవితాల్లోకి తొంగి చూడటం వల్ల తమ జీవితం ఎలా చీకటి మయం అయ్యిందో ఈ సినిమాలో చక్కగా చూపించారు.


Also Read: ఫ్రెండ్‌తో కోడలు ఎఫైర్ - అత్తను హత్యచేసి మామకు అడ్డంగా దొరికిపోతుంది, ఇక అన్నీ ట్విస్టులే!



Read Also: అందుకే నా పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా - అసలు విషయం చెప్పిన తాప్సి