పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాతో గత శుక్రవారం(జూలై 28) ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి తేజ తో కలిసి పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక 'బ్రో' షూటింగ్ పూర్తి చేసిన అనంతరం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే తన నెక్స్ట్ మూవీ 'OG' షూటింగ్ కోసం వచ్చేసారు. ప్రభాస్ తో 'సాహూ' వంటి యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచే భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. 'సాహో' తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న సుజీత్ ఈ సినిమా కోసం పవర్ఫుల్ స్టోరీని రెడీ చేసుకుని ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేశారు.


ఇక ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా 'OG' అని పిలుస్తున్నారు. ఇప్పటికే 'OG' వర్కింగ్ టైటిల్ తో విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి మేకర్స్ టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ - సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'దే కాల్ హిమ్ ఓజి(They Call Him OG) అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు తాజాగా ఈ టైటిల్ తో కూడిన ఓ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే మేకర్స్ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ కి తప్ప మరొకరికి సూట్ అవ్వదు అంటూ ఫ్యాన్స్ అయితే ఈ టైటిల్ తో తెగ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఓ పవర్‌ఫుల్ గ్యాంగ్ స్టార్ పాత్రలో చూపించబోతున్నారు సుజిత్.






ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. సుజిత్.. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావడంతో ఈ సినిమాల్లో ఫ్యాన్ స్టఫ్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో భారీ కాస్టింగ్ కూడా ఉంది. ఇప్పటికే సినిమా కోసం బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మీ, కోలీవుడ్ నుంచి యంగ్ విలన్ అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి వంటి నటీ, నటులను కీలక పాత్రల కోసం తీసున్నారు. మాఫియా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని 'ఆర్ ఆర్ ఆర్' మూవీ నిర్మాత డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.


ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ నెలలో సినిమాని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో వచ్చే లాభాల్లో మూడో వంతు వాటా కూడా తీసుకునేలా పవన్ కళ్యాణ్ నిర్మాతలతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read : దయా' రివ్యూ : జేడీ చక్రవర్తి నటించిన తొలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial