SSMB29 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు సంగతి... దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. ఆయన చేతిలో ఒక పాస్‌పోర్ట్‌ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పాస్‌పోర్ట్‌ తాను సీజ్ చేశాను అన్నట్లుగా ఆయన ఆ వీడియోలో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. కట్ చేస్తే... సినిమా షూటింగ్ కొంత చేసిన తర్వాత మహేష్ బాబు ఫారిన్ వెళ్లి వచ్చారు. వెళ్లే ముందు ఎయిర్ పోర్టులో పాస్‌పోర్ట్‌ చూపించారు. తన పాస్‌పోర్ట్‌ తాను తీసుకున్నానని ఇన్ డైరెక్టుగా చెప్పారు. సమ్మర్ హాలిడేస్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన పాస్‌పోర్ట్‌ సరెండర్ చేయాల్సి వచ్చింది. 

Continues below advertisement


హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్న మహేష్!
ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో మహేష్ బాబు మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. హీరోతో పాటు కొంత మంది కీలక  తారాగణం సైతం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మరో 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలిసింది.


ఛలో కెన్యా... నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్రికాలో!
ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న చిత్రీకరణ ముగిసిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి అండ్ కో అంతా ఆఫ్రికాలోని కెన్యా దేశానికి వెళుతున్నారు. అక్కడ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆల్రెడీ రాజమౌళి కెన్యా వెళ్లి వచ్చారు. అక్కడ షూటింగ్స్ లొకేషన్ రెక్కీ నిర్వహించిన విషయం ప్రేక్షకులకు కూడా తెలుసు. సుమారు నెల పాటు కెన్యాలో కీలక సన్నివేశాలు తీయాలని ప్లాన్ చేశారట.


Also Readపవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? ఛాంబర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది?


మహేష్ బాబుతో పాటు SSMB29లో హాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న ఇండియన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విలన్ క్యారెక్టర్ చేయమని తమిళ హీరో మాధవన్ ను రాజమౌళి అప్రోచ్ అయ్యారట. మొదట విక్రమ్ దగ్గరకు వెళ్ళగా ఆయన 'నో' చెప్పడంతో మాధవన్ దగ్గరకు వెళ్లారని టాక్. చివరకు ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది. ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Also Read: ట్రైన్‌లో రామ్ చరణ్ ఫైట్... 'పెద్ది' కోసం ఎవరూ చేయని రిస్క్!