Mahesh Babu Special Wishes To Gautam Birthday: సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్‌కు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పారు. ప్రస్తుతం ఆయన దర్శక ధీరుడు రాజమౌళి 'SSMB29' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వేరే చోట ఉండడంతో ఫస్ట్ టైం నీ బర్త్ డే మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

క్యూట్ ఫోటో

గౌతమ్ పుట్టిన రోజున తాను అందుబాటులోకి లేకపోవడంతో మహేష్ బాబు కాస్త ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఈ సందర్భంగా గౌతమ్‌తో చిన్నప్పుడు కలిసి ఉన్న క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ... బర్త్ డే విషెష్ చెప్పారు. '19వ వసంతంలోకి అడుగుపెట్టిన గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతీ ఏడాది నువ్వు నన్ను కొంచెం ఎక్కువగా ఆశ్చర్యపరుస్తున్నావు. ఈ ఏడాది నీ పుట్టినరోజును మిస్ అవుతున్నా. నీ బర్త్ డే మిస్ కావడం ఇదే ఫస్ట్ టైం. నా ప్రేమ ప్రతీ అడుగులోనూ నీతోనే ఉంటుంది. నువ్వు చేసే ఏ పనిలోనైనా అతి పెద్ద చీర్ లీడర్. ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ... పెరుగుతూ మరింత ఎత్తుకు ఎదగాలి.' అంటూ పోస్ట్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు గౌతమ్‌కు బర్త్ డే విషెష్ చెబుతున్నారు.

Also Read: రికార్డ్ బ్రేకింగ్ 'అఖండ 2'... బిగ్ బిజినెస్ డీల్ - ఆ ఓటీటీకే స్ట్రీమింగ్ రైట్స్!... మన బాలయ్య అంటే అట్లుంటది మరి

ఆఫ్రికాలో షూటింగ్

ప్రస్తుతం 'SSMB29' షూటింగ్ ఆఫ్రికాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ హైదరాబాద్, ఒడిశాలో కంప్లీట్ కాగా కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం టీం ఆఫ్రికా వెళ్లిందనే ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తుండగా... ఆమె తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రియాంక అక్కడ నేచర్, ఫుడ్ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోస్ షేర్ చేయగా ఇది ఉత్తర ఆఫ్రికా అని కెన్యాలో ఏమైనా ఉన్నారా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఇదే టైంలో మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ సైతం ఆ ఫోటోలకు లైక్ కొట్టారు. దీంతో 'SSMB29' మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

మరోవైపు... కొత్త షెడ్యూల్స్‌ను నైరోబీ, టాంజానియాలో మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబరులో ఈ మూవీ నుంచి మహేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్‌తో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ విజువల్ వండర్ సిల్వర్ స్రీన్‌పై చూడాలంటే 2027 వరకూ ఆగాల్సిందే మరి.