Karthikeya Baje vayu Vegam Title And Motion Poster: గతేడాది 'బెదురులంక 2012'తో మంచి హిట్‌ కొట్టాడు 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేం హీరో కార్తికేయ. నిన్న రంజాన్‌ సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తన 8వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమా టైటిల్‌తో ప్రకటన సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. శుక్రవారం మహేష్‌ బాబు చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.  ఈ సినిమాకు 'భజే వాయు వేగం' అనే టైటిల్‌ ఖరారు చేస్తూ యానిమేటేడ్‌ వీడియోతో సరికొత్తగా ప్రకటన ఇచ్చారు. ఈ సందర్బంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌గా ఆసక్తిగా ఉంది. ఇందులో కార్తికేయ బ్యాట్‌ పట్టుకుని పరుగులు పెడుతూ కనిపించాడు.







ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతూ కనిపించాయి. చూస్తుంటే ఈ సినిమా డబ్బు చూట్టూ తిరుగుతుందనిపిస్తుంది. అలాగే మూవీ టీం కూడా మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ.. అతడు పార్క్ తన అదృష్టం కోసం పరుగెడుతున్నాడు. ఇక మిమ్మల్ని సీట్ల అంచున ఉంచే రేసీ థ్రిల్లర్‌గా సినిమా ఉంటుంది" అంటూ ట్వీట్‌ చేసి మూవీపై హైప్‌ క్రియేట్‌ చేశారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు.  ఇందులో కార్తికేయ సరసన మలయాళ నటి ఐశ్వర్యమీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. హ్యాపీ డేస్ ఫేం రాహుల్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాధన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కపిల్‌ కుమార్‌ బీజీఎం సమకూరుస్తున్నాడు. 


కాగా కార్తికేయ ఆర్‌ఎక్స్‌100(Rx 100) చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాల చేశాడు. కానీ ఆర్‌ఎక్స్‌100 లాంటి హిట్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. బాక్సాఫీసు వద్ద అతడి సినిమాలన్ని యావరేజ్‌గా నిలిచాయి. ఆ తర్వాత వరుసగా ప్లాప్స్‌ చూస్తున్న కార్తికేయ గతేడాది బెదురులంక సినిమాతో మంచి హిట్‌ కొట్టాడు. హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్‌గానూ మెప్పిస్తున్నాడు. నాని 'గ్యాంగ్‌ లీడర్‌'లో తొలిసారి నెగిటివ్‌ షేడ్‌లో కనిపించి తన నటనతో మెప్పించాడు. తెలుగులోనే తమిళంలోనూ ఆఫర్స్‌ అందుకుంటున్నాడు. రీసెంట్‌గా స్టార్‌ హీరో అజిత్‌ 'వలిమై' చిత్రంలో విలన్‌గా నటించి అక్కడ నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో కార్తికేయ నటనకు విమర్శకులు ప్రశంసలు కూడా దక్కాయి. మరి హీరోగా ఈ మధ్య ప్లాప్స్‌ చూస్తున్న కార్తికేయ ఈసారైనా ఆర్‌ఎక్స్‌100 లాంటి హిట్‌ కొడతాడా? లేదా? చూడాలి.