Mahesh Babu Fans Anger About Khaleja Re Release Scenes Trimmed: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా' శుక్రవారం థియేటర్లలో రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈలలు, కేకలు వేస్తూ తమ అభిమాన హీరో మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినా ఆ తర్వాత మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Continues below advertisement


ఫ్యాన్స్‌కు బిగ్ ట్విస్ట్


అయితే.. 'ఖలేజా' రీ రిలీజ్‌లో మూవీ టీం ఫ్యాన్స్‌కు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. కొన్ని సీన్స్ కట్ చేశారని.. పాటలు కూడా తీసేశారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై థియేటర్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. తమకు ప్రింట్ అలానే వచ్చిందంటూ వారు సమాధానం చెబుతున్నారు. కొన్ని చోట్ల థియేటర్ యాజమాన్యాలతో ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు. ఎన్నో ఆశలు పెట్టుకుని మూవీని ఎంజాయ్ చేద్దామని వస్తే ఇలా చేశారని.. ఎంజాయ్ చేయలేకపోయామంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు.






సోషల్ మీడియాలో ట్రోలింగ్


ఓవైపు 'ఖలేజా' థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. మరోవైపు.. మూవీలో కీలక సీన్స్, పాటలు కట్ చేశారంటూ కొందరు ట్రోలింగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మూవీ టీం స్పందించాల్సి ఉంది.


Also Read: ఓటీటీలోకి వచ్చేసిన మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ 'తుడరుమ్' - తెలుగులోనూ చూసేయండి


'అతడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా'పై అప్పట్లో భారీ హైప్ నెలకొంది. మహేష్‌ను డిఫరెంట్ రోల్‌లో కామెడీ యాంగిల్‌లో చూపించారు త్రివిక్రమ్. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే, ఆ తర్వాత ఈ మూవీపై క్రేజ్ నెలకొంది. మూవీలో కొన్ని డైలాగ్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ..యాక్షన్, కామెడీ, ఫాంటసీ కలగలిపి తెరకెక్కించిన చిత్రాన్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. తర్వాత రోజుల్లో ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. 


'ఖలేజా' మూవీలో మహేష్ బాబు సరసన స్వీటీ అనుష్క హీరోయిన్‌గా నటించారు. ప్రకాష్ రాజ్ విలన్ రోల్‌లో నటించి మెప్పించారు. రావు రమేష్, షఫీ, సునీల్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, సుబ్బరాజు, అర్చన కీలక పాత్రలు పోషించారు. 


ఫ్యాన్స్‌పై ప్రొడ్యూసర్ కామెంట్స్


అప్పట్లో మహేష్ బాబు ఫ్యాన్సే 'ఖలేజా' సినిమాను చంపేశారంటూ ప్రొడ్యూసర్ సి.కల్యాణ్ తాజాగా అన్నారు. 'వాళ్లేదో ఎక్స్‌పెక్ట్ చేశారు. సినిమాలో మహేష్ కామెడీ యాంగిల్‌ను యాక్సెప్ట్ చేయలేకపోయారు. రాత్రి షో అయిపోయిన తర్వాత తాగేసి ఫోన్స్ చేసి బూతులు తిట్టారు. డైరెక్టర్‌కు సినిమా తీయడం రాదంటూ కామెంట్ చేశారు. కానీ రీ రిలీజ్ అప్పుడు మాత్రం అదే ఫ్యాన్స్ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ఈ సక్సెస్ మూవీకి రావాలని రాసి పెట్టి ఉంది.' అంటూ కామెంట్స్ చేశారు.