Maa Oori Polimera 2 : డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మా ఊరి పొలిమేర'. 2021లో ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న 'మా ఊరి పొలిమేర 2' విడుదలకు సిద్దమైంది. గౌరీకృష్ణ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరి కృష్ణ నిర్మాతగా రూపుదిద్దుకున్న ఈ సినిమా పార్ట్ 1 2021లో డిసెంబర్ లో నేరుగా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది, సస్పెన్స్ థ్రిల్లర్ గా డిఫరెంట్ స్ర్కీన్ ప్లేతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 


ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న 'మా ఊరి పొలిమేర 2'కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ లో ఓ వ్యక్తి మెడపై రక్తం కారుతూ ఉండగా.. తన రెండు చేతుల్ని పెకి ఎత్తి దండం పెడుతున్నాడు. మంటల మధ్యలో అర్థనగ్నంగా కూర్చొని, అటుగా తిరిగి (వీపు భాగాన్ని చూపిస్తూ)కూర్చున్నాడు. ఆద్యంతం ఇంట్రస్టెంగ్ గా, ఉత్కంఠను రేకెత్తిస్తోన్న ఈ థ్రిల్లింగ్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. 


పార్ట్ 1కు సీక్వెల్ గా రాబోతున్న 'మా ఊరి పొలిమేర 2' త్వరలోనే విడుదల కూడా కానున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్ట్ 1 మాదిరిగానే పార్ట్ 2 కూడా ఆదరిస్తారని మేకర్స్ ఆశిస్తున్నారు. మూవీ టీం అంతా కలిసి ఓ ఫ్యామిలీలా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశామని ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ తెలిపారు. దర్శకుడు అనిల్ ఈ సినిమాకు అద్భుతంగా తెరకెక్కించారన్న ఆయన.. ఈ సినిమాలో నటించిన నటీనటులకు ఈయన ధన్యవాదాలు తెలిపారు. 


'మా ఊరి పొలిమేర పార్ట్ 1'ను అందరూ బాగా ఆదరించారని, ఇప్పుడు దానికి సీక్వెల్ గా 'మా ఊరి పొలిమేర పార్ట్ 2' ఉందని ప్రకటిస్తూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశామని డైరెక్టర్ అనిల్ తెలిపారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా మూవీ మేకర్స్ తో పాటు మూవీకి సంబంధించిన అందరిలోనూ ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక పార్ట్ 1 తరహాలో ఫ్యాన్స్ ను అలరిస్తుందా.. లేదంటే దానికి భిన్నంగా రెస్పాన్స్ వస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.


ఇక హీరో రాజేష్ విషయానికొస్తే.. ఇప్పటివరకు సుమారు 350కి పైగా సినిమాల్లో నటించిన ఆయనకు హీరో సుమంత్ నటించిన 'సత్యం' సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. 'మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి', 'జై', 'అసాధ్యుడు', 'వేదం', 'నాయకి', 'హీరో', 'దృశ్యం', 'చిరుత', 'నేనింతే', 'డాన్ శీను', 'కొమురం పులి'... లాంటి ఎన్నో అగ్రహీరోలు నటించిన సినిమాల్లో నటించి మెప్పించారు.