Maa Inti Bangaram First Day Collections: బాక్సాఫీస్ బరిలోనూ తాను బంగారమే అని సమంత రూత్ ప్రభు నిరూపించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం'. జూన్ 19న విడుదలైంది. మొదటి రోజు బాక్సాఫీస్ బరిలో అదిరిపోయే కలెక్షన్లను సాధించింది. సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్లు 10 కోట్లు దాటాయి. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయి? టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందీ సినిమా? వంటి వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

'మా ఇంటి బంగారం' ఓపెనింగ్ డే @ 10 కోట్లు ప్లస్!Maa Inti Bangaram First Day Worldwide Gross Collection: ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 10.70 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది ''మా ఇంటి బంగారం'. ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు ఇది రికార్డ్ స్థాయి ఓపెనింగ్ అని చెప్పాలి. 

  • ఇండియాలో 'మా ఇంటి బంగారం' మొదటి రోజు నెట్ కలెక్షన్స్ విషయానికి వస్తే... రూ. 5.35 కోట్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్స్ లెక్క చూస్తే... రూ. 6.20 కోట్లు.
  • ఓవర్సీస్ మార్కెట్టులోనూ 'మా ఇంటి బంగారం' చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్ లభిచింది. మొదటి రోజు 4.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 150 వేల డాలర్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించిందీ సినిమా.
  • ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 'మా ఇంటి బంగారం' గ్రాస్ కలెక్షన్స్ రూ. 10.70 కోట్లు దాటాయి.

Continues below advertisement

Also Read: Transfer Trimurthulu Review - ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు రివ్యూ: వడ్డే నవీన్ కమ్‌ బ్యాక్ సినిమా... హిట్టా? ఫట్టా?

సమంతకు తెలుగులో స్ట్రాంగ్ మార్కెట్!సమంత తెలుగింటి కోడలు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆ విషయం చెప్పడానికి 'మా ఇంటి బంగారం' కలెక్షన్లు ఉదాహరణ. ఈ సినిమాకు తెలుగు వెర్షన్ నుంచి రూ. 5.15 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా... తమిళ వెర్షన్ నుంచి కేవలం రూ. 20 లక్షల నెట్ మాత్రమే వచ్చింది. రాష్ట్రాల వారీగా చూసినా... ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.75 కోట్ల గ్రాస్ రాగా... కర్ణాటక నుంచి రూ. 90 లక్షలు, తమిళనాడు నుంచి రూ. 38 లక్షలు, కేరళ నుంచి రూ. 2 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది.

Also Read: Maa Inti Bangaram OTT - సమంత మా ఇంటి బంగారం ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

'మా ఇంటి బంగారం' సినిమా క్రిటిక్స్ రివ్యూలు చూస్తే... సమంత యాక్షన్ మీద ప్రశంసల వర్షం కురిసింది. ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మౌత్ టాక్ కూడా బావుండటంతో రెండో రోజు సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయి. రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు.

Also ReadVanda Devullu Review - 'వంద దేవుళ్ళు' రివ్యూ: అమ్మకు మళ్ళీ పెళ్లి... 'బిచ్చగాడు' కాంబినేషన్‌లో లేటెస్ట్ సినిమా - ఎలా ఉందంటే?