Allu Arjun Interaction With Shraddha Through Make A Wish Foundation : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రద్ధ అనే చిన్నారిని ఆప్యాయంగా పలకరించి మర్చిపోలేని క్షణాన్ని అందించారు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా చిన్నారి శ్రద్ధ గురించి తెలుసుకున్న ఆయన... వీడియో కాల్‌లో మాట్లాడారు.
పుష్ప డైలాగ్‌తో...
వీడియో కాల్‌లో సడన్ సర్పైజ్ ఇచ్చిన బన్నీ... పాపతో సరదాగా ముచ్చటించారు. 'పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైరు' అంటూ పుష్ప సినిమాలో డైలాగ్స్ చెప్పి చిన్నారికి ఆనందాన్ని పంచారు. అనారోగ్యంతో బాధ పడుతున్న పాప త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ కావడం తన డ్రీమ్ అని శ్రద్ధ బన్నీతో చెప్పింది. త్వరలోనే హైదరాబాద్ వస్తానని చిన్నారి చెప్పగా... ఆమెను ఆహ్వానించారు. వీడియో కాల్‌లో శ్రద్ధ పేరెంట్స్‌తో మాట్లాడారు. ఈ వీడియో ఇన్ స్టా హ్యాండిల్స్‌లో వైరల్ అవుతోంది.
ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు బన్నీపై ప్రశంసలు కురిపిస్తూ... వీడియో షేర్ చేస్తున్నారు. చిన్నారి శ్రద్ధ కోరిక మేరకు పాపకు మెమెరబుల్ మూమెంట్ అందించారని ఆయనలో ఆప్యాయతకు ఇది నిదర్శనమని అంటున్నారు.
Also Read : Maa Inti Bangaram Review - 'మా ఇంటి బంగారం' రివ్యూ: సమంత యాక్షన్ సూపర్... మరి సినిమా హిట్టా? ఫట్టా?
ప్రాణాంతక, తీవ్రమైన అనారోగ్యంతో పోరాడే చిన్నారుల కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంస్థ నెరవేరుస్తుంది. శ్రద్ద కూడా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఫౌండేషన్ ద్వారా శ్రద్ధ కోరికను తెలుసుకున్న బన్నీ... వీడియో కాల్‌లో మాట్లాడి చిన్నారికిి ఆనందాన్ని పంచారు. ఆమె త్వరగా కోలుకోవాలని బన్నీతో పాటు ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. పూర్తిగా కోలుకున్నాక పాపను హైదరాబాద్ రావాలని బన్నీ ఆహ్వానించారు.
