ఒక సినిమా విడుదలయిన తర్వాత మాత్రమే కాదు.. విడుదల అవ్వకముందు కూడా దాని చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు.. ఇలా ప్రతీ అంశంలో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి కొందరు ప్రేక్షకులు సిద్దంగా ఉంటారు. తాజాగా కోలీవుడ్ నుంచి ఎన్నో అంచనాలతో విడుదల అవుతున్న సినిమా ‘లియో’ చుట్టూ కూడా ఇలాంటి ఒక కాంట్రవర్సీనే అల్లుకుంది. తాజాగా విడుదలయిన ట్రైలర్‌లో బూతులు ఉన్నాయంటూ కొందరు ప్రేక్షకులు దానిని ఖండించడం మొదలుపెట్టారు. ఇక ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుండగా.. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ రియాక్ట్ అయ్యాడు.
ట్రైలర్‌లో బూతులు..
విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన చిత్రమే ‘లియో’. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం ‘మాస్టర్’ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. అందుకే ‘లియో’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా ‘లియో’ అనేది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమా కాదా అనే అంశం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేస్తోంది. ఇదే సమయంలో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది టీమ్. ఈ ట్రైలర్‌లో విజయ్ ఒక బూతు పదాన్ని ఉపయోగించడం, అది మూవీ టీమ్ మ్యూట్ చేయకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. తాజాగా లోకేశ్ కనకరాజ్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఈ కాంట్రవర్సీ గురించి తనకు ప్రశ్న ఎదురయ్యింది.
నాదే బాధ్యత..
ఫిల్మ్ మేకర్ వికటన్‌తో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు లోకేశ్ కనకరాజ్. అందులో ‘లియో’ ట్రైలర్‌లో ఉన్న బూతుల గురించి తనకు ప్రశ్న ఎదురవ్వగా.. అసలు బూతు పదాలు ఉపయోగించడం తన ఉద్దేశం కాదని, ఆ సీన్‌లో క్యారెక్టర్ ఎమోషన్స్‌ను స్పష్టంగా చూపించడం కోసం ఉపయోగించక తప్పలేదని అసలు విషయాన్ని బయటపెట్టాడు లోకేశ్. అంతే కాకుండా విజయ్ కూడా అలా మాట్లాడడానికి ముందు ఇష్టపడలేదని, అలా మాట్లాడడం ఓకేనా కాదా అని పదేపదే ఆలోచించాడని లోకేశ్ అన్నాడు. కానీ సినిమా కోసం విజయ్‌ను తానే ఒప్పించానని, అందుకే ఇప్పుడు ఈ పరిణామానికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని లోకేశ్ ఓపెన్‌గా చెప్పేశాడు.
దానికోసమే స్పెషల్ ఇంట్రెస్ట్..
అక్టోబర్ 19న ‘లియో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించినా.. రత్నకుమార్, దీరజ్ వైడీతో కలిసి కథను పూర్తి చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా కోసం విజయ్, త్రిష జతకట్టారు. ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్, ప్రియా ఆనంద్ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ‘లియో’ నుంచి విడుదలయిన పాటల్లో అనిరుధ్ ఫ్లేవర్ కనిపిస్తుందని, అప్పుడే పలువురు మ్యూజిక్ లవర్స్.. ఈ పాటలను తమ రింగ్‌టోన్‌లాగా కూడా పెట్టేసుకున్నారు. ముఖ్యంగా ‘ఖైదీ’, ‘విక్రమ్’లాగా ‘లియో’ కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమా కాదా అని తెలుసుకోవడం కోసం విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అంశం వల్లే ‘లియో’కు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకశాలు ఉన్నట్టు ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు.
Also Read: షారుఖ్ ఖాన్‌కి హత్యా బెదిరింపులు.. Y+ భద్రతను కల్పించిన ప్రభుత్వం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial