సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth )రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటుంది. తమిళ్ మాత్రమే కాదు... తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఆయనకు మార్కెట్ ఉంది. ఆయన ఇమేజ్ మీద సినిమాలు ఆడతాయి. అందుకని కోట్లకు కోట్లు ఆయనకు ఇవ్వడానికి నిర్మాతలు రెడీ. మరి, ఆయనతో సినిమా తీసే దర్శకుడికి? సూపర్ స్టార్ లేటెస్ట్ సినిమా 'కూలీ'కి దర్శకత్వం వహించిన లోకేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
50 కోట్ల రూపాయలు తీసుకున్నా - లోకేష్Lokesh Kanagaraj Remuneration Per Coolie Movie: 'కూలీ' సినిమాకు తాను ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నదీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ లేటెస్టుగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఓపెన్‌గా చెప్పేశారు. 'కూలీ'కి 50 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వివరించారు. రెండేళ్ల పాటు తాను ఈ సినిమా కోసం వర్క్ చేశానని, చాలా కష్టపడ్డానని, సో అంత రెమ్యూనరేషన్ తీసుకోవడం వర్త్ అని లోకేష్ పేర్కొన్నారు. 'విక్రమ్', 'లియో' విజయాలతో లోకేష్ కనగరాజ్ అంటే ప్రేక్షకులలో నమ్మకం ఏర్పడింది. ఆయన సిఎంలకు వసూళ్లు రావడంతో కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం ముందుకు వస్తున్నారు.
Also Read: కూలీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూశాక సూపర్ స్టార్ ఏం చెప్పారంటే?
రెమ్యూనరేషన్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ... ''బాక్స్ ఆఫీస్ గురించి హీరో, దర్శకుడు, నిర్మాత మాత్రమే బాధ్యత తీసుకోవాలి. సినిమా ఆడితే లాభం వచ్చేది ఎక్కువగా ఆ ముగ్గరికి. హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్ పెరుగుతాయి. 'లియో' 600 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి 'కూలీ'కి నాకు 50 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు నేను 'కూలీ' 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా? లేదా? అని ఆలోచించడం లేదు. ప్రేక్షకుడు టికెట్ మీద పెట్టె 150 రూపాయల గురించి ఆలోచిస్తున్నాను'' అని చెప్పారు.
Also Read: శ్రీలీల ఫ్యాన్స్‌కు పండగ... 'మాస్ జాతర'లో దుమ్ములేపే డాన్స్ నంబర్
థియేట్రికల్ బిజినెస్ పరంగా 'కూలీ' రికార్డులుCoolie Movie Pre Release Business: 'కూలీ' సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. రజనీకాంత్ కాకుండా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, ప్రత్యేక గీతంలో పూజా హెగ్డే నటించారు. కేవలం స్టార్స్ రెమ్యూనరేషన్లు 150 నుంచి 200 కోట్లు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మూవీ మేకింగ్ కాస్ట్ కూడా కలిపితే ఎలా లేదన్నా 350 నుంచి 400 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్. ఆగస్టు 14న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.