Rajinikanth's Coolie Trailer Release Date: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబో అవెయిటెడ్ మూవీ 'కూలీ'. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఆగస్ట్ 14న మూవీ రిలీజ్ కానుండగా ట్రైలర్ ఎప్పుడు? అనే సస్పెన్స్‌కు మేకర్స్ తాజాగా తెర దించారు.
రూమర్స్‌కు చెక్...
ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడొస్తుంది? ట్రైలర్ రిలీజ్ కాకుండానే సినిమా వచ్చేస్తోందా? అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా రూమర్స్ హల్చల్ చేశాయి. కొందరు మీమ్స్‌తో సెటైరికల్ ట్వీట్స్ చేశారు. తాజాగా... ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ మూవీ టీం క్లారిటీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఆగస్ట్ 2న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Also Read: నా జీవితంలో కథే 'మిస్టర్ రెడ్డి'... ఎంతో మంది మోసం చేసినా భయపడకుండా విడుదలకు... - టీఎన్ఆర్
దళపతిలా అనిపించింది
ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఇటీవల రజినీ సార్‌కు మూవీ చూపిస్తే తనను హగ్ చేసుకుని... 'నాకు ఈ చిత్రం దళపతిలా అనిపించింది.' అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారని తెలిపారు. ముందు ఫాంటసీ స్టోరీ రాశానని... మేకింగ్‌కు ఎక్కువ టైం పడుతుందనే ఆ ప్రాజెక్ట్ స్థానంలో 'కూలీ'ని తెరకెక్కించినట్లు చెప్పారు. 'హార్బర్ బ్యాక్ డ్రాప్‌లో స్మగ్లింగ్ నేపథ్యంగా సాగే స్టోరీ ఇది. మూవీ సెట్స్‌లో రోజూ 700 మంది నుంచి 1000 మంది వరకూ పని చేసేవారు.' అని వెల్లడించారు.
సాంగ్స్ ట్రెండింగ్...
ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన 'చికిటు', 'మోనికా మై డియర్ మోనికా' సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా 'మోనికా' సాంగ్‌లో బుట్ట బొమ్మ పూజా హెగ్డేతో మలయాళ స్టార్ సౌబిన్ సాహిర్ స్టెప్పులు అదిరిపోయాయి. ఫుల్ గ్రేస్ ఎనర్జిటిక్‌తో సౌబిన్ డ్యాన్స్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆయనలో డ్యాన్సర్‌ను లోకేశ్ గుర్తించారని అంటున్నారు.
ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించగా... తలైవాతో పాటు కింగ్ నాగార్జున, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, శ్రుతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. రజినీకాంత్ 'కూలీ నెం.1421'గా కనిపించనుండగా... నెగిటివ్ రోల్‌లో నాగార్జున నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇటీవలే ఆయన మాస్ లుక్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా... ఐమాక్స్ ఫార్మాట్‌లోనూ మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 14న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.