Hari Hara Veera Mallu Latest News Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్'. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఈ నెల (జూలై 24), 2025న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. ఆల్రెడీ అంచనాలు ఆకాశమంత ఉన్న ఈ సినిమా సెన్సార్ తాజాగా పూర్తి అయ్యింది. 

వీరమల్లుకు యు/ఎVeera Mallu Censor Certificate: 'హరి హర వీరమల్లు'కు సెన్సార్ బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు అద్భుతంగా ఉందని దర్శక నిర్మాతలను ప్రశంసించారు. బలమైన కథ, కథనాలకు తోడు భారీ విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పినట్టు తెలిసింది.

Also Readడెడ్ బాడీ దగ్గర సెల్ఫీలు ఏంటి? బుద్ధి ఉందా? కోట ఇంటి వద్ద రాజమౌళి అసహనం

వీరమల్లు కథ ఏమిటి?Veera Mallu Story: పదిహేడవ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో వీరమల్లు సినిమా తెరకెక్కింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేసిన యోధుడిగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా న్యాయం, ధర్మం కోసం వీరమల్లు చేసిన ప్రయాణమే సినిమా. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయ్యింది. ఇక బాక్సాఫీస్ పరంగా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక విశాఖలో చేయనున్నట్టు చిత్ర బృందం కన్ఫర్మ్ చేసింది. ఆ వేడుకకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా రానున్నారని ఫిల్మ్‌ నగర్ టాక్.

Also Readకొడుకుతో కలిసి ఒకే ఒక్క సినిమా చేసిన కోట శ్రీనివాస రావు... అది ఏమిటో తెలుసా?

పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన 'హరిహర వీరమల్లు' సినిమాలో బాబీ డియోల్ విలన్. నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి, అనుపమ్ ఖేర్, సునీల్, సత్యరాజ్, సుబ్బరాజు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమాకు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు.