Sreeleela: శ్రీలీల ఫ్యాన్స్‌కు పండగ... 'మాస్ జాతర'లో దుమ్ములేపే డాన్స్ నంబర్
మాస్ మహారాజా రవితేజ, శ్రీ లీల జంటగా నటిస్తున్న తాజా సినిమా 'మాస్ జాతర'. ఈ జంట దీనికి ముందు 'ధమాకా' చేసింది. అందులో పాటలు సూపర్ హిట్. అంతకు మించి ఆ పాటల్లో రవితేజతో, శ్రీ లీల వేసిన స్టెప్స్ సూపర్ హిట్. అంతకు మించి అనేలా మళ్ళీ స్టెప్స్ వేసినట్టు వర్కింగ్ స్టిల్స్ చూస్తే తెలుస్తోంది.
Mass Jathara Song Choreography By Jani Master: 'మాస్ జాతర' సినిమాలో జానీ మాస్టర్ ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. ఇది పక్కా మాస్ డాన్స్ నంబర్ అని ఈ స్టిల్ చూస్తే అర్థం కావడం లేదూ!
శ్రీ లీలతో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని జానీ మాస్టర్ పేర్కొన్నారు. 'మాస్ జాతర' పాటలో ఆవిడ డైనమిక్ ఎనర్జీని ఆడియన్స్ అందరూ చూసే క్షణం కోసం ఎదురు చూస్తున్నాని ఆయన తెలిపారు.
సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక జానీ మాస్టర్ కు థాంక్యూ చెబుతూ శ్రీ లీల ఫ్లవర్ బొకే పంపించారు.
వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న థియేటర్లలోకి సినిమా రానున్న సంగతి తెలిసిందే.