కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్ నటించిన 'లియో'Leo) మూవీ అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతోంది. ప్రస్తుతం థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటున్న ఈ మూవీని అనుకున్న డేట్ కి కాకుండా ముందుగానే రిలీజ్ చేయబోతుండటం గమనార్హంగా మారింది. అందుకు కారణం లియో మూవీ ఆన్ లైన్ లో లీక్ అవ్వడమే అని చెబుతున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. 'విక్రమ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ - దళపతి విజయ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'లియో'(Leo) దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. తొలి రోజు నుంచి మూవీకి మిక్స్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపింది.


'ఖైదీ', 'విక్రమ్' స్థాయిలో 'లియో' లేదని వాదనలు వినిపించాయి. కానీ మొదటి రోజే లియో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.140 కోట్లు రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, దళపతి విజయ్ ఇందులో నట విశ్వరూపం చూపించడంతో ఫ్యాన్స్​తో పాటు సినీ ఆడియన్స్ లియో మూవీకి మంచి రెస్పాన్స్ అందించారు. ప్రస్తుతం థియేటర్స్​లో సక్సెస్​ఫుల్​గా రన్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఆన్ లైన్​లో లీక్ అయింది. దీంతో సినిమా డిజిటల్ రైట్స్​ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సినిమాని అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.


'లియో' మూవీని ముందుగా నవంబర్ 21న ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మేకర్స్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇక ఇప్పుడు ఆన్ లైన్​లో లీక్ అవ్వడంతో నవంబర్ 16 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'లియో' మూవీ స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అటు లియో మేకర్స్ నుంచి కానీ, నెట్ ఫ్లిక్స్ నుంచి గాని ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. కాగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'లియో' బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నవంబర్ 4 వరకు ఈ మూవీకి ఏకంగా రూ.522 కోట్ల గ్రాస్ రావడం విశేషం.


రజనీకాంత్ 'జైలర్' మూవీ రికార్డుకి ఆమడ దూరంలోనే 'లియో' ఆగిపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఆన్ లైన్​లో లీక్ అవడం, ముందుగానే ఓటీటీలోకి వస్తుందనే వార్తల నేపథ్యంలో కలెక్షన్​పై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, మడోనా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ మీనన్, సాండీ, మాథ్యూ, మన్సూర్ అలీ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్. ఎస్ లలిత్ కుమార్ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి అన్బరివ్ యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేశారు.


Also Read : ముగ్గురు బడా హీరోలతో స్పై యూనివర్స్ - 'టైగర్ 3'లో సల్మాన్, షారుక్​తో పాటూ మరో హీరో కూడా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial