మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'ఈగల్'(Eagle) మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్​ని అందించారు. ఇటీవల 'ఈగల్' మూవీ టీజర్ అనౌన్స్మెంట్ అంటూ పోస్టర్​ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో స్పెషల్ పోస్టర్​తో ఈగల్ టీజర్ డేట్ అండ్ టైం ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రజెంట్ రవితేజ హిట్, ప్లాప్స్​తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా 'టైగర్ నాగేశ్వరావు'(Tiger Nageshwararao) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని వంశీకృష్ణ దర్శకత్వం వహించారు.


అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇప్పటికీ ఇంకా థియేటర్స్ లో సక్సెస్​ఫుల్​గా రన్ అవుతుంది. దీని తర్వాత  రవితేజ నుంచి 'ఈగల్'(Eagle) అనే మూవీ రాబోతోంది. టాలీవుడ్​లో బెస్ట్ సినిమాటోగ్రాఫర్​గా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, మోషన్ టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.






నవంబర్ 6 ఉదయం 10 గంటల 44 నిమిషాలకు 'ఈగల్'(Eagle) టీజర్ ని విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు మరో సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. రవితేజ కళ్ళు మాత్రమే కనిపించేలా ఉన్న ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఈగల్ టీజర్ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ టీజర్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కష్టమే అని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో మేకర్స్ ఆ వార్తలను ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని ముందు అనుకున్న డేట్ ప్రకారం జనవరి 13న సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.


పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. రవితేజ మల్టిపుల్ షేడ్స్ లో కనిపించనున్న ఈ సినిమాలో మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్'(Eagle) తో పాటు మహేష్ 'గుంటూరు కారం'(Guntur Karam), విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'(Family Star) నాగార్జున 'నా సామి రంగా'(Naa Saami Ranga), తేజ సజ్జ 'హనుమాన్'(Hanuman) వంటి సినిమాలు పోటీ పడనున్నాయి. వీటితోపాటు మరికొన్ని సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలన్నింటిలో ఎన్ని సినిమాలు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటాయో చూడాలి.


Also Read : 'గుంటూరు కారం' నుంచి 'దమ్ మసాలా' సాంగ్ ప్రోమో వచ్చిసిందోచ్ - మీరు చూశారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial