టాలీవుడ్లో టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న సునీల్ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీ అయిపోతున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అగ్ర హీరోల సినిమాల్లో ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోవైపు విలన్‌గాను అదరగొడుతున్నాడు. ముఖ్యంగా తమిళ భాషలో సునీల్‌కు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కన్నడ అగ్ర హీరో సినిమాలో సునీల్ నటించే ఛాన్స్ కొట్టేశాడు. డీటెయిల్స్‌లోకి వెళ్తే.. 'పుష్ప' సినిమాతో విలన్ అవతారం ఎత్తాడు సునీల్. ఈ సినిమాలో మంగళం శ్రీనుగా సునీల్ విలక్షణ నటనకి మంచి గుర్తింపు లభించింది.
పుష్ప తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇతర భాషల్లో అవకాశాలు తలుపు తట్టాయి. ముఖ్యంగా తమిళంలో అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్నాడు. వాటిలో చాలా వరకు అగ్ర హీరోల సినిమాలు కావడం విశేషం. రీసెంట్ టైమ్స్ లో 'మహావీరుడు', 'జైలర్', 'మార్క్ ఆంటోనీ' వంటి సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించిన సునీల్ కి ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న 'మ్యాక్స్'(Max) మూవీలో సునీల్ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మహాబలిపురంలో చిత్రీకరణ జరుపుకుంటుంది.
కిచ్చా సుదీప్ తప్ప ఈ సినిమాలోని ఇతర నటీనటుల గురించి పెద్దగా సమాచారం ఏమీ బయటకి రాలేదు. అయితే ఈమధ్య సునీల్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర నిర్మాత కలై పులి ఎస్ థాను అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మూవీ టీం స్వయంగా సునీల్ పోస్టర్ విడుదల చేస్తూ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. కార్తికేయ విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో సునీల్ విలన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సునీల్ నటించిన మొదటి కన్నడ ప్రాజెక్టు ఇది. ఇందులో సునీల్ పాత్ర కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే తమిళ మేకర్స్ తనపై చూపిస్తున్న ప్రేమకి సునీల్ ఎంతో సంతోషంగా ఉన్నాడు.
తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న సునీల్ ఇప్పుడు కన్నడ నుంచి కూడా అవకాశం అందుకోవడంతో దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ కూడా భాగమవడంతో తెలుగులోనూ ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఎలాగో సుదీప్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్య సుదీప్ నటిస్తున్న కన్నడ చిత్రాలన్నీ తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. 'మ్యాక్స్' కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సుదీప్ సరసన సిమ్రత్, సంయుక్త హోర్నాడ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని' రివ్యూ : హీరో కాల్ బాయ్ అయితే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial