అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కథానాయకుడిగా మురళి కిషోర్ అబ్బురు (Murali Kishor Abburu) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin Movie). ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ బంపర్ కలెక్షన్స్ వచ్చాయి. జూలై 10న విడుదలైన అఖిల్ సినిమా... మొదటి మూడు రోజుల్లో 37 కోట్లు కలెక్ట్ చేసింది. మరి మండే కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్? నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...
స్టడీగా నిలబడిన 'లెనిన్'... మండే మూడున్నర కోట్లు!Lenin Box Office Collection Day 4 India Net: వీకెండ్ తర్వాత వచ్చే మొదటి రోజు, మండే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గుతుంది. అందువల్ల, సోమ నుంచి మళ్ళీ శుక్ర వారం వరకు కలెక్షన్స్ కాస్త తక్కువగా ఉంటాయి. సండే వచ్చిన కలెక్షన్లలో సగం వస్తే సినిమా స్టడీగా ఉన్నట్టే.
'లెనిన్' విడుదలైన నాలుగో రోజు... మొదటి సోమవారం ఇండియాలో ఈ సినిమాకు రూ. 3.60 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మూడో రోజు కలెక్షన్ల (రూ. 9.65 కోట్లు)తో పోలిస్తే 62 శాతం తక్కువ. సోమవారం ఇలా తక్కువ రావడం సహజమేనని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో 'లెనిన్' ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 29.05 కోట్లు. గ్రాస్ విషయానికి వస్తే... ఇండియాలో రూ. 33.37 కోట్లు కలెక్ట్ చేసింది. విదేశాల్లో కూడా 'లెనిన్' స్టడీగా నిలబడింది. ఇప్పటి వరకు (నాలుగు రోజుల్లో) రూ. 8.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ నుంచి సోమవారం 45 లక్షల గ్రాస్ వచ్చింది.ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 'లెనిన్' కలెక్ట్ చేసిన అమౌంట్ రూ. 41.42 కోట్ల గ్రాస్.
నాలుగో రోజు ఎక్కడ నుంచి ఎన్ని కోట్లు వచ్చాయ్?Lenin Telugu States Four Days Collection: ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు రూ. 3.70 కోట్ల గ్రాస్ వచ్చింది. థియేటర్లలో 30.12 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. విశాఖ (59), వరంగల్ (51.8), గుంటూరు (40.5) నగరాల్లో మంచి ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది.
'లెనిన్' సినిమాలో అఖిల్ అక్కినేని నటన, యాక్షన్ సన్నివేశాలకు అక్కినేని ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి ప్రశంసలు లభించాయి. తమన్ సంగీతం, లియోన్ బ్రిట్టో కెమెరా వర్క్ సినిమాకు ప్లస్ అయ్యాయి. త్వరలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో 50 కోట్లను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా... ప్రమోద్ పంజు, రమేష్ ఇందిరా, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
