మలయాళ స్టార్, పాన్ ఇండియా ప్రేక్షకులకు సుపరిచితుడైన కథానాయకుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil). ఆయన హీరోగా నటించిన మలయాళ సినిమాలను చూసిన తెలుగు ప్రేక్షకులు ఎంతో మంది. 'పుష్ప' సిరీస్‌లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మెప్పించారు. ఇప్పుడు హీరోగా స్ట్రెయిట్ తెలుగు సినిమా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు ఫహాద్ ఫాజిల్. ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. 

Continues below advertisement

నవ్వులే మేజిక్... ఫాంటసీ కథ!Don't Trouble The Trouble Teaser Review Telugu: 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' టీజర్ చూస్తే... స్టోరీలో మెయిన్ పాయింట్ ఏమిటి? అనేది ఈజీగా అర్థం అవుతుంది. హైదరాబాద్ సిటీలోని ఓ చిన్న ఇంటిలో తన పాపతో కలిసి సూరి (ఫహాద్ ఫాజిల్) నివసిస్తుంటాడు. అయితే... అల్లావుద్దీన్ దీపంలో నుంచి జీనీ బయటకు వచ్చినప్పుడు, ఓ చిన్నారిలో నుంచి అతీంద్రీయ శక్తులు బయటకు వస్తాయి. అవి చూసి హీరో భయపడతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా కథ. 

Also ReadNag Ashwin - 'కల్కి' క్లైమాక్స్‌పై విమర్శలు... రిప్లై ఇచ్చిన నాగ్ అశ్విన్ - నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు

Continues below advertisement

'ఓం ఫట్... ఫటా ఫట్... పాని పట్... అలియా భట్' అంటూ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' టీజర్‌లో మొదటి డైలాగ్‌తో ఫహాద్ ఫాజిల్ తన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో చూపించారు. పాపతో ఆయన సీన్స్ బావున్నాయి. ఫాంటసీ కథతో రూపొందుతున్న ఈ సినిమాపై టీజర్ అంచనాలు క్రియేట్ చేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Also ReadTejaswini Nandamuri Latest Dance Video - సారంగదరియా పాటకు తేజస్విని నందమూరి డ్యాన్స్... సాయి పల్లవి రేంజ్‌లో బాలయ్య చిన్న కుమార్తె స్టెప్పులు

సెప్టెంబర్ 11న థియేటర్లలోకి సినిమా... Don't Trouble the Trouble Release Date: 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాకు  శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. 'ప్రేమలు'తో పంపిణీదారుగా ఎస్ఎస్ కార్తికేయ భారీ విజయాన్ని అందుకున్నారు. షోయింగ్ బిజినెస్ సంస్థను స్థాపించి నిర్మాతగా మారారు. సెప్టెంబర్ 11న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్టు వెల్లడించారు. తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా సినిమా విడుదల కానుంది. ఈ మూడు భాషల్లో టీజర్ విడుదలైంది.   

అర్కా మీడియావర్క్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు కలిసి 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'బాహుబలి' ఫ్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ప్రఖ్యాత నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న చిత్రమిది.

Also ReadLenin Box Office Collection Day 3 - లెనిన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... అయ్యగారి కెరీర్‌లో నంబర్ వన్ - అఖిల్ దూకుడు