Singer S Janaki Death Cause: దక్షిణాది గానకోకిల (Nightingale of South India)గా పేరు గాంచిన ప్రముఖ గాయని ఎస్. జానకి. ఆమె గొంతు మూగబోయింది. ఈలోకం నుంచి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది.
మైసూరులో జానకి కన్నుమూతఎస్ జానకి వయసు 88 ఏళ్ళు. ఈ రోజు (శనివారం, జూలై 11న) మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలతో జానకి మరణించినట్లు ఆమె మనవరాలు అప్సర తెలిపారు.
ఎస్ జానకి మృతితో భారతీయ సంగీత ప్రపంచంలో ఓ సువర్ణ అధ్యాయానికి ముగింపు పడిందని చెప్పవచ్చు. ఏప్రిల్ 23, 1938న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్)లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో ఎస్ జానకి జన్మించారు. ఆమె తండ్రి శిష్టా శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యునిగా, అలాగే ఉపాధ్యాయునిగా సేవలు అందించారు.
జానకి బాల్యం సిరిసిల్లలో గడిచింది. తొమ్మిదేళ్ల వయసులో మొదటిసారి స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అందరి ముందు సింగింగ్‌లో తన ప్రతిభ చాటారు. ఆ తర్వాత నాదస్వర విద్వాంసులు పైడిస్వామి దగ్గర సంగీతంలో ప్రాథమిక పాఠాలు అభ్యసించారు. అయితే... శాస్త్రీయ సంగీతంలో ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు.
జానకి మొదటి సినిమా ఏదో తెలుసా?S Janaki Singing Debut: తమిళ సినిమా 'విధియిన్ విలయాత్తు' (1957)తో 19 ఏళ్ల వయసులో నేపథ్య గాయనిగా జానకి ప్రయాణం ప్రారంభమైంది. అక్కడ నుంచి ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. సుమారు ఆరు దశాబ్దాల పాటు సాగిన ఎన్నో అద్భుతమైన పాటలను శ్రోతలకు అందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో సుమారు 48 వేలకు పైగా పాటలను ఆలపించారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి కాంబినేషన్ పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్. వాళ్లిద్దరూ కలిసి వేలాది పాటలు ఆలపించారు. అవన్నీ అజరామరంగా నిలిచాయి. సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ తర్వాత 2016లో రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇకపై పాటలు పాడానని చెప్పారు. అయితే... 2018లో తమిళ సినిమా 'పన్నాడి'లో తన చివరి పాటను పాడారు.
Also Read: Salim Kumar Passed Away - మాలీవుడ్‌లో విషాదం... గుండెపోటుతో నేషనల్ అవార్డు విన్నర్ సలీం కుమార్ మృతి
జానకికి వచ్చిన అవార్డులు ఎన్నో తెలుసా?జానకి గాత్రంలో మాధుర్యానికి నాలుగుసార్లు జాతీయ పురస్కారం లభించింది. ఇక రాష్ట్ర పురస్కారాల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ రాష్ట్రాల నుంచి 33 అవార్డులు లభించాయి. భారత ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించగా... జానకి తీసుకోవడానికి నిరాకరించారు. సంగీత, చిత్రసీమకు తాను చేసిన సేవలకు అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' రావాలని పేర్కొన్నారు. జానకి కుటుంబ సభ్యుల విషయానికి వస్తే... 959లో వి. రామ్ ప్రసాద్‌తో జానకి వివాహం జరిగింది. ఆయన 1997లో గుండెపోటుతో మరణించారు.
Also Read: Kumod Raney - స్నేహితురాలి మరణంతో సల్మాన్ కంటతడి... ఎవరీ కుముద్ రాణే?
