బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కన్నీటి పర్యంతమైన వీడియో వైరల్ అవుతోంది. సల్మాన్ ఒక్కరే కాదు... ఆయన కుటుంబం అంతా కన్నీటి పర్యంతం అయ్యింది. ఆ వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. కుముద్ రాణే మరణంతో ఖాన్ ఫ్యామిలీ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. అసలు ఎవరీ కుముద్? సల్మాన్‌కు ఏమవుతారు? అనేది తెలుసుకోండి.
మంగళవారం కన్నుమూసిన కుముద్ముంబైలో కుముద్ రాణే కన్ను మూశారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో ఆమె పోరాడుతున్నారు. క్యాన్సర్ పోరాటంలో అలసిన ఆవిడ మంగళవారం (జూన్ 9, 2026) తుది శ్వాస విడిచారు. కుముద్ మరణంతో ఖాన్ కుటుంబం ఎమోషనల్ అయ్యింది.
ఎవరీ కుముద్? సల్మాన్‌తో రిలేషన్ ఏంటి?Who Was Kumud Rane?: దుబాయ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుముద్ రాణే. దుబాయ్‌లోని పాపులర్ బ్యూటీ అండ్ వెల్నెస్ సెంటర్ 'రైన్ బ్యూటీ బార్' (Reign Beauty Bar) వ్యవస్థాపకురాలు ఆవిడ. ఇంటీరియర్ డిజైనింగ్, మార్కెటింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం.
How Was Kumud Rane Related To Salman Khan? సల్మాన్ ఖాన్‌కు కుముద్ రాణే ఎలా పరిచయం? అంటే... సల్మాన్ సన్నిహితుడు జగ్గీ రాణే భార్యే కుముద్. అలా ఖాన్ కుటుంబంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. క్లోజ్ ఫ్రెండ్ అయ్యింది. సల్మాన్, కుముద్ దంపతులకు ఓ కుమారుడు కబీర్ ఉన్నారు.
ఎంతో సన్నిహితురాలైన కుముద్ మరణంతో ఖాన్ కుటుంబం కన్నీటి పర్యంతం అయ్యింది. మంగళవారం ముంబైలో జరిగిన కుముద్ రాణే అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో కలిసి సల్మాన్ హాజరు అయ్యారు. ఆప్తమిత్రురాలిని కోల్పోయిన బాధలో కన్నీళ్లు తుడుచుకుంటూ సల్మాన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్‌తో పాటు సోదరులు సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోదరి అర్పితా ఖాన్ శర్మ, తల్లిదండ్రులు సల్మా ఖాన్, హెలెన్ కూడా కుముద్‌కు నివాళులు అర్పించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కుముద్‌ను ఉద్దేశించి సోహైల్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ''ఈ రోజు నా సోదరిని కోల్పోయాను. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు. కుముద్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... ఆమె నవ్వును, ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేమని అర్పితా ఖాన్ నివాళులు అర్పించారు. ఖాన్ కుటుంబమే కాదు... హిందీ చిత్రసీమలో ప్రముఖులైన మలైకా అరోరా, బాబీ డియోల్, యూలియా వంతూర్ సైతం కుముద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
