లావణ్య త్రిపాఠి ల‌వ్‌లో ఉన్నారా? అంటే... ఫిల్మ్ నగర్‌లో కొంత మంది 'అవును' అని అంటున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా లావణ్య ప్రేమ గురించి కథనాలు కూడా ప్రచురించింది. అయితే... తాను ప్రేమలో ఉన్నట్లు ఎప్పుడూ ఆమె చెప్పింది లేదు. బట్, ఫర్ ద ఫస్ట్ టైమ్ లవ్ గురించి లావణ్యా త్రిపాఠి కామెంట్స్ చేశారు. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆమె... ప్రేమ, పెళ్లిపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


లవ్... తొలిచూపులోనే పడను!
లవ్ ఎట్ ఫస్ట్ సైట్... చాలా మంది తొలిచూపులోనే ఎదుటి వ్యక్తితో ప్రేమలో పడినట్లు చెబుతారు. తాను ఆ విషయాన్ని నమ్మనని లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi On Love At First Sight ) తెలిపారు. అబ్బాయిని ప్రేమించాలా? వద్దా? అనేది అతనితో మాట్లాడి, కొంత సమయం గడిపితే గానీ చెప్పలేనని... మాట్లాడటం చాలా ముఖ్యమని ఆమె అంటున్నారు. బహుశా... ఎదుటి వ్యక్తితో మాట్లాడటం, టైమ్ స్పెండ్ చేయడం వంటివి చేస్తే అతని అభిరుచులు, అభిప్రాయాలూ తెలుస్తాయనేది ఆమె మనసులో మాట కావచ్చు. 


వరుణ్ తేజ్‌తో రెండు సినిమాలు చేయడంతో... 
వరుణ్ తేజ్,లావణ్యా త్రిపాఠి ప్రేమలో ఉన్నారని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. దానిపై లావణ్యా త్రిపాఠి స్పందించారు. వరుణ్‌తో రెండు సినిమాలు చేయడంతో అవి వచ్చి ఉంటాయని ఆమె అన్నారు. అంతకు మించి ఏమీ మాట్లాడలేదు (Lavanya Tripathi Reacts On link up rumours with Varun Tej).  


పెళ్లి మీద నమ్మకం ఉంది కానీ...
తనకు పెళ్లి మీద నమ్మకం ఉందని లావణ్యా త్రిపాఠి చెప్పారు. అయితే... ప్రస్తుతం తాను సింగిల్ అన్నారు. అందుకు కారణం సరైన జీవిత భాగస్వామి లభించలేదని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు. అదీ సంగతి!


తెలుగు ఇండస్ట్రీలో లావణ్యా త్రిపాఠి స్నేహితులు ఎవరంటే?
సినిమాలు ఉంటే షూటింగులతో బిజీ. సినిమా విడుదల దగ్గర పడినప్పుడు  ప్రచార కార్యక్రమాలతో బిజీ. మరి, ఖాళీగా ఉన్నప్పుడు? ఎవరితో టైమ్ స్పెండ్ చేస్తారు? తెలుగు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు? అని అడిగితే... ''నిహారిక, రీతూ వర్మ, సందీప్ కిషన్, అల్లు శిరీష్'' అని లావణ్యా త్రిపాఠి చెప్పారు. అందులో చాలా మంది తన కో స్టార్స్ అని ఆమె అన్నారు. అదీ సంగతి! నిహారిక అంటే వరుణ్ తేజ్ సిస్టర్, మెగా డాటర్ నిహారిక కొణిదెల. 


Also Read : తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?


ఫెయిల్యూర్స్ ఉన్నాయి!
లావణ్యా త్రిపాఠి కెరీర్ సాఫీగా ఏమీ సాగలేదు. ఆమె ప్రయాణంలో విజయాలు ఉన్నాయి. అపజయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఆమె అంగీకరించారు. అసలు, తెలుగులో తొలి సినిమా 'అందాల రాక్షసి' చేసినప్పుడు ఇన్నేళ్లు ఉంటానని అనుకోలేదని, కొన్ని సినిమాలు చేశాక హిందీకి వెళ్లాలని అనుకున్నానని, కానీ ఇప్పుడు హైదరాబాద్ తనకు రెండో ఇల్లు అయ్యిందని లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు. కెరీర్ స్టార్ట్ అయినప్పుడు సక్సెస్ సరిగా ఎంజాయ్ చేయలేదని, ఆ తర్వాత సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడం ఎంత ముఖ్యం అనేది తనకు అర్థం అయ్యిందని ఆమె తెలిపారు. సినిమాల్లో జయాపజయాలు సహజమని, అందువల్ల పరాజయాలను తాను పర్సనల్ గా తీసుకోనని అన్నారు. 


Also Read : హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?