Actress Lavanya Tripathi Upcoming Movie 'Satileelavathi': హీరోయిన్ లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో ఓ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ అయింది. తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ ‘సతీ లీలావతి’. రెండేళ్ల క్రితం ‘హ్యాపీ బర్త్’ డే’ సినిమాలో కనిపించారు లావణ్యా త్రిపాఠి. ఇందులో ఆమె మెయిన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. 2023లో హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు. మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి ఓకే చెప్పారు లావణ్యా త్రిపాఠి.
అప్పట్లో నాని డైరెక్టర్
గతంలో దర్శకుడు తాతినేని సత్య నాని హీరోగా తమిళ, తెలుగు భాషల్లో ‘భీమిలీ కబడ్డీ జట్టు’ అనే సినిమా తీశారు. ఆ సినిమా నటుడిగా నానికి మంచి పేరు తీసుకొచ్చింది. నాని ఫ్యాన్సకు గుర్తుండిపోయే సినిమా ఇది. ఈ సినిమా తర్వాతే నానికి ‘అలా మొదలైంది’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా హిట్ కావడంతో నానికి హీరోగా మార్కెట్ కూడా పెరిగింది. అనంతరం హీరో సుధీర్ బాబు డెబ్యూ మూవీ ‘ఎస్.ఎం.ఎస్' (శివ మనసులో శృతి)’కి దర్శకత్వం వహించారు తాతినేని సత్య. అనంతరం ‘శంకర’, వీడెవడు’ సినిమాలు తీశారు. కొంత కాలం గ్యాప్ తర్వాత దర్శకుడు తాతినేని సత్య తీస్తున్న సినిమానే ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకంపై నాగమోహన్ బాబు. ఎమ్, రాజేష్ .టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డిసెంబర్ 15న (ఆదివారం) హీరోయిన్ లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. మిక్కీ జే మేయర్ స్వరాలు అందించనున్న ఈ మూవీకి బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తున్నారు.
Also Read: అఖిల్, శ్రీలీల జంటగా... 20 నెలల గ్యాప్ తర్వాత అయ్యగారి సినిమా మొదలు - దర్శక నిర్మాతలు ఎవరంటే?
Lavanya Tripathi Upcoming Movies: లావణ్య త్రిపాఠి ఓటీటీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.‘పులి మేక’ పేరుతో రూపొందిన వెబ్ సిరీస్ లో లావణ్య ఓ పోలీసాఫీసర్ గా కనిపిస్తారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారమైన ‘మిస్ పర్ఫెక్ట్’ లోనూ మెయిన్ రోల్ చేశారు లావణ్య. అయితే వెబ్ సిరీస్ లు ఆమెకు ఆశించినంత విజయం ఇవ్వలేకపోయాయి. తమిళంలో ఇప్పటి వరకూ రెండు సినిమాలు చేశారు లావణ్య. తాజాగా మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రవీంద్ర మాధవ దర్శకత్వంలో అధర్వ మురళి హీరోగా తెరకెక్కుతోన్న ‘తనళ్’ అనే యాక్షన్ థ్రిల్లర్ లో లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: ఆయ్... అజయ్ అరసాడ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండీ - ఓటీటీ టు సినిమా మ్యూజికల్ జర్నీపై ఇంటర్వ్యూ