'జైలర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా వస్తుందంటే బజ్ ఎలా ఉండాలి? ప్రచారం ఏ స్థాయిలో ఉండాలి? 'లాల్ సలాం' సినిమాకు అటువంటి బజ్ గానీ, ప్రచారం గానీ లేవు. హిట్టా? ఫ్లాపా? అనేది పక్కన పెడితే... 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత 'ఆచార్య'లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అతిథి పాత్ర చేశారు. అప్పుడు ప్రచారంలో చాలా వరకు ఆయన చుట్టూ తిరిగింది. 'లాల్ సలాం'కు అటువంటి ప్రచారం ఉందా? లేదు. బ్యాడ్ లక్ ఏమిటంటే... ఈ సినిమా తెలుగులో విడుదల అవుతున్న సంగతి రెండు తెలుగు రాష్ట్రాల్లో రజనీ అభిమానులకు తెలియదు.
ఇంకా తెలుగు ట్రైలరే విడుదల చేయలేదు!
'లాల్ సలాం' విడుదలకు పట్టుమని 48 గంటల సమయం కూడా లేదు. ఇంకా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదల చేయలేదు. తమిళ ట్రైలర్ విడుదలై 24 గంటలు గడిచింది. తెలుగు ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ లేదు. అసలు ఈ సినిమా మేకర్స్ తెలుగు రిలీజ్ గురించి పట్టించుకుంటున్నారా? లేదా? అని డౌట్ కలుగుతోంది.
ప్రస్తుతానికి ఒక్క థియేటరే... అదీ క్రాస్ రోడ్స్!
తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా నగరాల్లో మల్టీప్లెక్స్ స్క్రీన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కాలేదు. ప్రస్తుతానికి ఒక్క థియేటర్, అదీ క్రాస్ రోడ్స్ సప్తగిరిలో బుకింగ్స్ స్టార్ట్ ఓపెన్ చేశారు. గురువారం (ఫిబ్రవరి 7న) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన 'యాత్ర 2', శుక్రవారం (ఫిబ్రవరి 8న) మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' విడుదల అవుతున్నాయి. ఆ తర్వాత రోజు 'ట్రూ లవర్' (తమిళ డబ్బింగ్) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ మూడు సినిమాలకు ఒక స్థాయిలో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ సినిమా చడీ చప్పుడు లేకుండా విడుదల అవుతోంది.
Also Read: 'కెజియఫ్' రూటులో పుష్పరాజ్ - ఐకాన్ స్టార్ తగ్గేది లే
రజనీకాంత్ అతిథి పాత్ర సినిమాకు అడ్వాంటేజ్. 'లాల్ సలాం' టీం దాన్ని అసలు వాడుకోవడం లేదు. తెలుగు పబ్లిసిటీ మీద కాన్సంట్రేట్ చేయడం లేదు. 'లాల్ సలాం'లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు విష్ణు విశాల్ తెలుసు. ఆయన తెలుగు ఇంటి అల్లుడు. గుత్తా జ్వాలా భర్త. రానా 'అరణ్య'లో విష్ణు విశాల్ ఒక క్యారెక్టర్ చేశారు. ఇంకా 'మట్టి కుస్తీ', 'ఎఫ్ఐఆర్' సినిమాలు తెలుగులో మోస్తరుగా ఆడాయి.
Also Read: సాయి రాజేష్... సందీప్ రెడ్డి వంగా... 'బేబీ' హిందీ రీమేక్... కాన్ఫిడెంట్‌గా ఎస్కేఎన్!
'లాల్ సలాం'లో నటి, దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. రజనీ సోదరిగా ఆమె కనిపిస్తారని సమాచారం. ఆవిడతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేసినా సరే తెలుగు ప్రేక్షకులకు సినిమా విడుదల గురించి తెలిసేది. 'లాల్ సలాం' టీం అది కూడా చేయలేదు. చడీ చప్పుడు లేకుండా రజనీకాంత్ సినిమా తెలుగులో విడుదల అవుతుండటం ఇదే మొదటిసారి ఏమో!?
Also Read: ప్రేక్షకులకు అందుబాటులో 'ఈగల్'... మాసోడి సినిమాకు తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?