L2E Empuraan : అభిమానులు కంప్లీట్ యాక్టర్ గా పిలుచుకునే మలయాళ స్టార్ మోహన్ లాల్. ఈ హీరో త్వరలోనే తన బ్లాక్ బస్టర్ మూవీ 'లూసిఫర్' రీమేక్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 'ఎల్2ఇ ఎంపురాన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు. 

'ఎల్2ఇ ఎంపురాన్' టీజర్ హైలెట్స్ ఇవే 

'ఎల్2ఇ ఎంపురాన్' టీజర్ లో ముందుగా ఖురేషిని పరిచయం చేశారు. ఇక స్టీఫెన్ గా మోహన్ లాల్ ని ఒక పవర్ఫుల్ డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చారు.  "ఏదో ఓ రోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మోసగాళ్లు అని అనిపించినప్పుడు... ఈ నాన్న లేకుంటే నిన్ను ఆదుకోగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు... అతడే స్టీఫెన్" అంటూ టీజర్ లోనే హీరోకి మంచి ఎలివేషన్ ఇచ్చారు. అలాగే టీజర్ లో ఉన్న "యుద్ధం మంచి, చెడులకు మధ్య కాదు... చెడుకు చెడుకు మధ్య, జగదీష్ స్టీఫెన్ హిందువులకు మహిరావణుడు, ముస్లింలు ఇబ్లిస్ అని పిలుస్తారు. క్రిస్టియానిటీలో ఇతనికి ఒకే ఒక పేరు ఉంది... అదే లూసిఫర్" అనే డైలాగులు  అదిరిపోయాయి. "హి ఈజ్ కమింగ్ బ్యాక్" అనే డైలాగ్ తో మోహన్ లాల్ లుక్ ను రివీల్ చేసి ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్.

అలాగే టీజర్ లోనే ఈ మూవీలో మోహన్ లాల్ మరో పేరు ఖురేషి అబ్రహం అని వెల్లడించారు. అయితే మిలటరీ వాళ్లు స్టీఫెన్ ను టార్గెట్ చేయడం, "డీల్ విత్ డెవిల్" అని మోహన్ లాల్ చెప్పే డైలాగ్, టీజర్ చివర్లో పృథ్విరాజ్ సుకుమార్ అని చెప్పే "ఒక్క మాట భాయీ జాన్... నేను ఎదురు చూస్తున్నాను" అని చెప్పే డైలాగులు హైలెట్ గా నిలిచాయి. అంతేకాకుండా టీజర్ విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంది. మొత్తానికి 'ఎల్2ఇ ఎంపురాన్' టీజర్ తోనే స్టోరీ 'లూసిఫర్' కంటే సీక్వెల్ లో మరింత గ్రిప్పింగ్ స్టోరీతో ఆకట్టుకోబోతోందని అనిపించేలా చేశారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోవడంతో సీక్వెల్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. 

సమ్మర్ లో 'ఎల్2ఇ ఎంపురాన్' సందడి... మోహన్ లాల్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'లూసిఫర్'. ఈ మలయాళ మూవీ 2019లో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న మూవీనే 'ఎల్2ఇ ఎంపురాన్'. ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. లూసిఫర్, బ్రో డాడి వంటి సినిమాల తర్వాత మోహన్ లాల్ - పృథ్వీరాజ్ కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ ఇది. ఈ మూవీతో నిర్మాత సుభాస్కరన్ మలయాళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 'ఎల్2ఇ ఎంపురాన్' సినిమాకు దీపక్ దేవ్ మ్యూజిక్ అందించగా, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Readటీఆర్పీలో 10 ప్లస్ కిందకు పడిన కార్తీక దీపం 2... డాక్టర్ బాబుకు ప్రభాకర్ కాంపిటీషన్ - ఈ వారం టాప్10 లిస్ట్ చూడండి