Kushitha Kallapu About Gunturu Kaaram Movie: బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ హీరోగా, కుషిత కల్లపు హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ‘బాబు నెం 1 బుల్‌ షిట్‌ గయ్‌'. డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్  కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మార్చి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ వేడుకలో ‘బేబీ’ చిత్ర నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత వివేక్ కూచిభొట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.  ఫ్యాషన్ తో ‘బాబు నెం 1 బుల్‌ షిట్‌ గయ్‌' సినిమాను చేసినట్లు దర్శకుడు లక్ష్మణ వర్మ తెలిపారు. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే థ్రిల్లర్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. చిత్రబృందం అంతా కలిసి మనసు పెట్టిన ఈ సినిమా చేసినట్లు చెప్పారు. అందుకే ఈ సినిమా అవుట్ పుట్ చక్కగా వచ్చిందన్నారు.  ఫ్యామిలీతో కూర్చుని హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇదని హీరో, హీరోయిన్లు అర్జున్‌ కల్యాణ్, కుషిత కల్లపు వెల్లడించారు.  


‘గుంటూరు కారం’లో నటించాను, కానీ- కుషిత


అటు ‘గుంటూరు కారం’ సినిమాలో నటించినా, ఎడిటింగ్ లో తన సన్నివేశాలను తీసేసినట్లు కుషిత వెల్లడించింది. “‘గుంటూరుకారం‘ సినిమాలో నేను నటించాను. 4 రోజులు షూటింగ్ కు వెళ్లాను. సినిమాలో మాత్రం నా సన్నివేశాలు లేవు. నేను సినిమా టీమ్ ను అడిగాను. నువ్వే కాదు, నీతో పాటు నటించిన మరికొంతత మందిని కూడా ఎడిటింగ్ లో తీసేశారు అని చెప్పారు. కారణాలు ఏంటి అనేది నాకు తెలియదు. సినిమాల్లో ఇలా అవడం కామన్ అనుకున్నాను. కానీ, ఈ సినిమాలో కనిపించకపోవడం పట్ల బాగా ఫీలయ్యాను. సోషల్ మీడియాతో పోల్చితే, బిగ్ స్క్రీన్ మీద నటించడం చాలా కష్టం. కెమెరా ముందు యాక్టింగ్ చేయాలంటే పెద్ద టాస్క్. నిజానికి ఈ సినిమాకు సైన్ చేసే సమయానికి నాకు పెద్దగా యాక్టింగ్ కూడా రాదు. అర్జున్ ఉన్నాడు కాబట్టి కంఫర్ట్ గా చేయగలిగాను. ఈ సినిమా ద్వారా చాలా వరకు యాక్టింగ్ నేర్చుకున్నాను. సోషల్ మీడియాతో బిగ్ స్క్రీన్ ను కంపేర్ చేసుకోలేం. ఈ సినిమాలో నేను డబ్బింగ్ చెప్పలేదు. నా వాయిస్ సరిగా ఉండదు కాబట్టి వేరే వాళ్లు చెప్పారు” అని వెల్లడించింది.


వేణు స్వామి ఎందుకు అలా అన్నారో తెలియదు- కుషిత


తాను చెప్పడం వల్లే కుషిత బాగా వైరల్ అయ్యిందంటూ వేణు స్వామి చెప్పడం పట్ల కుషిత ఆశ్చర్య వ్యక్తం చేసింది. నిజానికి తనను పబ్ ఇష్యూ జరిగిన తర్వాతే కలిశానని ఆయన ఎందుకు అలా అన్నారో తెలియదని చెప్పింది. మళ్లీ ఆయన కలిస్తే ఈ విషయాన్ని అడుగుతానని వెల్లడించింది. అటు తాను బజ్జీలు తినడానికి పబ్ కి వెళ్లాను అని చెప్తే ఎవరూ నమ్మడం లేదన్నారు. అప్పుడు నమ్మలేదు. ఇప్పుడూ నమ్మడం లేదు. కానీ, అదే నిజమని కుషిత తేల్చి చెప్పింది.



Read Also: నెలకు రూ.35 లక్షలు - ఆ ఛాన్సు వదులుకొని అష్టకష్టాలు పడ్డా: ‘12Th ఫెయిల్’ హీరో ఆవేదన