Gutur Kaaram Kurchi Madatapetti Song : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా రిలీజ్ అయిన ధమ్ మసాలా, ఓ మై బేబి వంటి సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఇక తాజాగా థర్డ్ సింగిల్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. 'కుర్చీ మడతపెట్టి' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ లో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులు అదిరిపోయియాయి. ఇదిలా ఉంటే థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసిన దగ్గర నుంచి సోషల్ మీడియా అంతట ఈ సాంగ్ పై ఓ రేంజ్ లో డిస్కషన్ జరుగుతోంది. గతంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన 'కూర్చి మడత పెట్టి' అనే డైలాగ్ తో రకరకాల పాటలు వచ్చాయి. ఇప్పుడు అదే సాంగ్ ని మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అసలు మహేష్ బాబు క్రేజ్ ఏంటి? ఆయన సినిమాలో ఇలాంటి సాంగ్ పెట్టడం ఏంటి? అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పై, త్రివిక్రమ్ పై ఫ్యాన్స్, నెటిజన్స్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.






ఇక మహేష్ కల్ట్ ఫ్యాన్స్ అయితే రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇదే విషయంపై నిర్మాత నాగ వంశీ తాజాగా స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఇలా ట్వీట్ చేశారు. 'ప్రోమోపై వస్తున్న చాలా అభిప్రాయాలను 'మేము చూశాం. కొంతమంది లిరిక్స్, కొన్ని పదాల వినియోగం గురించి మమ్మల్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఏం లేదు.. మన సూపర్ స్టార్ మహేశ్ బాబు గారు జస్ట్ కుర్చీ మడత పెట్టి డాన్స్ చేసారు అంతే కదా.. దీన్ని పాజిటివ్ గా ఆలోచించండి. గుంటూరు కారం అనేది మాస్, ఫ్యామిలీ, యూత్ అన్ని వర్గాలను సంతృప్తిపరిచే వినోదభరితమైన సినిమా. పూర్తి హై వోల్టేజ్, అన్ని భావోద్వేగాలు ఉన్నాయి. జనవరి 12న తప్పకుండా అభిమానులకు, సినీ ప్రేమికులకు సంక్రాంతి పండుగకు భారీ మాస్ ఫీస్ట్ అవుతుంది' అంటూ పేర్కొన్నారు.


దీంతో నాగ వంశీ చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కంప్లీట్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, ఈశ్వరి రావు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : ‘హాయ్ నాన్న’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?