Hi Nanna OTT Release Date Lock: నేచురల్ స్టార్ నాని, ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాగూర్ నటించిన రీసెంట్ మూవీ ‘హాయ్ నాన్న’. నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 7న థియేటర్లలో విడుదల అయ్యింది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, తండ్రీ కూతుర్ల మధ్య బాండింగ్ అలరించింది. నాని కెరియర్ లోనే బెస్ట్  ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది. నాని కూతురుగా నటించిన కియారా ఖన్నా, చక్కటి నటనతో ఆకట్టుకోగా, నాని, మృణాల్ బెస్ట్ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించారు.  


జనవరి 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘హాయ్ నాన్న’ స్ట్రీమింగ్


థియేటర్లలో విడుదలై ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. 'హాయ్ నాన్న' డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ. 37 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. జనవరి 4 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మళయాలంతో పాటు హిందీలోనూ విడుదలకానుంది.






ఓవర్సీస్ లో ‘నాని’ సరికొత్త రికార్డు


ఇక ‘హాయ్ నాన్న’ సినిమా వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. ఓవర్సీస్ లో వీకెండ్ పూర్తవక ముందే మిలియన్ మార్క్ దాటింది.  టైర్ 2 హీరోల్లో ఎక్కువ సార్లు ఓవర్సీస్ మార్కెట్ దగ్గర 1 మిలియన్ మార్క్ అందుకున్న హీరోగా నాని సరికొత్త రికార్డ్ క్రేయేట్ చేశాడు. ఈ సినిమాతో కలిపి మొత్తం నాని నటించిన తొమ్మిది సినిమాలు ఈ ఘనతను సాధించడం విశేషం. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.  


'సరిపోదా శనివారం' షూటింగ్ లో నాని బిజీ


ఇక ఈ ఏడాది ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నాని. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఇక ‘హాయ్ నాన్న’ సినిమాలతో రెండో విజయాన్ని అందుకున్నారు. నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం' అనే సినిమా చేస్తున్నారు.. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Read Also: అసలే నెగెటివిటీ, ఇప్పుడో బూతు పాట - ఇప్పుడు చీప్‌గా అనిపించడం లేదా త్రివిక్రమ్? అప్పటి కామెంట్స్ మరిచారా?