కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao)కు తెలుగు చలన చిత్రసీమలోని హీరోలు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అందరితోనూ ఆయన నటించారు. అయితే... మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy)తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ముగ్గురికీ ఓ సినిమా చాలా స్పెషల్! అది ఏమిటి? ఎందుకు? అనేది తెలుసా?

ముగ్గురి మొదటి సినిమా ఒక్కటే!Kota Srinivasa Rao First Movie: కోట శ్రీనివాస రావు మొదటి సినిమా 'ప్రాణం ఖరీదు'. రంగస్థల నటుడిగా అప్పటికే పేరు తెచ్చుకున్న ఆయన, ఆ సినిమాలో తొలిసారి తెలుగు తెరపై కనిపించారు.

Chiranjeevi First Released Movie: మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై మొదటి సారి కనిపించిన సినిమా కూడా 'ప్రాణం ఖరీదు' కావడం విశేషం. నిజానికి, చిరంజీవికి తొలుత 'పునాదిరాళ్ళు'లో అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం ముఖానికి మేకప్ వేసుకున్నారు. అయితే, 'పునాదిరాళ్ళు' విడుదల ఆలస్యం కావడం... ఆ తర్వాత అవకాశం వచ్చిన 'ప్రాణం ఖరీదు' ముందు విడుదల కావడంతో అదే చిరు మొదటి సినిమా అయ్యింది.

ఆర్ నారాయణ మూర్తి మొదటి సినిమా కూడా 'ప్రాణం ఖరీదు'. డిగ్రీ కూడా కంప్లీట్ చేయక ముందు సినిమాల్లో నటించారు పీపుల్స్ స్టార్. సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని హీరోగా రూపొందిన 'నేరము - శిక్ష'లో నటించారు. అయితే... అందులో జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేశారు. ఆ తర్వాత చదువు మీద దృష్టి సారించారు. డిగ్రీ పూర్తి చేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. తెలుగు తెరపై కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశారు. అదీ 'ప్రాణం ఖరీదు' సినిమాలో!

Also Read: కొడుకుతో కలిసి ఒకే ఒక్క సినిమా చేసిన కోట శ్రీనివాస రావు... అది ఏమిటో తెలుసా?

చిరంజీవి... ఆర్ నారాయణ మూర్తి... కోట శ్రీనివాస రావు... ఈ ముగ్గురికీ అలా మొదటి సినిమా ఒక్కటే (ప్రాణం ఖరీదు) అయ్యింది. వాళ్ళ నట ప్రయాణంలో ఆ సినిమా ఓ ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది.

చిరు - కోట కాంబినేషన్ సూపర్ హిట్!Kota Srinivasa Rao - Chiranjeevi Movies List: చిరంజీవి, కోట శ్రీనివాస రావు కాంబినేషన్ సూపర్ హిట్. చిరు సినిమాల్లో కోట కొన్ని మంచి పాత్రలు చేశారు. అబ్బాయ్ అంటూ 'అన్నయ్య'లో చేసిన నటన నవ్వించడంతో పాటు చివర్లో కంటతడి పెట్టిస్తుంది. 'యముడికి మొగుడు', 'స్నేహం కోసం', 'ముఠా మేస్త్రి', 'అల్లుడా మజాకా', 'రౌడీ అల్లుడు', 'డాడీ'... చెబుతూ వెళితే చిరు - కోట కలయికలో చాలా సినిమాలు ఉన్నాయి. ఒక్క చిరంజీవితో మాత్రమే కాదు... హీరోలు అందరితో కోట శ్రీనివాస రావుకు సత్సంబంధాలు ఉన్నాయి. అందరితోనూ హిట్ సినిమాలు చేశారు. కోట మరణం పట్ల చిత్రసీమ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. Also Readతంబీ నమస్తేనే... గదైతే నేను ఖండిస్తన్నా - కోటా శ్రీనివాసరావు ఈ డైలాగ్స్ మర్చిపోగలమా!