త కొన్నేళ్లలో సినీ పరిశ్రమకు చెందిన ఎందరో సీనియర్ నటీనటులు, టెక్నీషియన్లు కన్నుమూశారు. తాజాగా మరో సీనియర్ టెక్నిషియన్‌ను కూడా సినీ పరిశ్రమ కోల్పోయింది. మిలన్ ఫెర్నాండెజ్.. కోలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు మిలన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం అజిత్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. హార్ట్ ఎటాక్ వల్ల ఆయన చనిపోయారని వార్తలు వైరల్ అయ్యాయి. సినీ ప్రముఖులు సైతం మిలన్ మృతికి సంతాపం తెలియజేయడానికి ముందుకొస్తున్నారు.


అజీర్‌బైజాన్‌లో షూటింగ్ చేస్తుండగా..


ప్రస్తుతం మిలన్ ఫెర్నాండెజ్.. అజిత్ హీరోగా నటిస్తున్న ‘విడాముయర్చి’ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసమే ఆయన అజీర్‌బైజాన్ వెళ్లారు. మగిర్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ‘విడాముయర్చి’ షూటింగ్ ఇటీవల ప్రారంభమయ్యింది. కోలీవుడ్‌లోనే ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిలన్ మరణ వార్తను ముందుగా లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. దీంతో ఈ వార్త అధికారికంగా బయటికొచ్చింది. నేడు షూటింగ్ ఉండగా.. మిలన్ దానికి తగిన సన్నాహాలు చేస్తున్న సమయంలోనే తనకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందని మూవీ టీమ్‌తో చెప్పాడు. దీంతో ప్రొడక్షన్ టీమ్ వెంటనే తనను హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌కు తరలించేలోపే ఆయన హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు.


రాత్రి బాగానే ఉన్నారు..


రాత్రి షూటింగ్ ముగించుకొని హోటల్‌కు వచ్చే సమయానికి కూడా మిలన్ బాగానే ఉన్నారని మూవీ టీమ్ చెప్తోంది. ఈరోజు ఉదయం కూడా తన టీమ్‌ను పిలిపించుకొని షూటింగ్ గురించి మాట్లాడారని అన్నారు. అదే సమయంలో మిలన్‌కు బాగా చెమటలు పట్టాయని, బాగా ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పారట. దీంతో ప్రొడక్షన్ టీమ్ వెంటనే ఆయన కోసం కారును ఏర్పాటు చేసి హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. కానీ హాస్పిటల్‌కు తరలిస్తుండగానే ఆయన కన్నుమూశారని మూవీ టీమ్ వివరించింది. లైకా ప్రొడక్షన్స్‌తో పాటు మరికొందరు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా మిలన్ మృతికి సంతాపం తెలియజేశారు.


తెలుగులో ఒకే సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా..


ఎన్నో ఏళ్లుగా కోలీవుడ్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మిలన్.. ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలకు తన ఆర్ట్‌ను అందించారు. అజిత్ నటించిన ఎన్నో ఇతర సినిమాలకు కూడా ఆయన ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. చెన్నైలో తన భార్య, కొడుకుతో కలిసి జీవించేవారు మిలన్. కేవలం సినిమాలకు మాత్రమే కాదు.. ఎన్నో యాడ్స్‌కు కూడా ఆయన ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. చివరిగా శింబు హీరోగా నటించిన ‘పాతు తలా’ చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్ చేశారు మిలన్. ఆర్ట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారభించినప్పటి నుండి ఎక్కువశాతం తమిళ చిత్రాల్లోకే పనిచేసిన మిలన్.. తన కెరీర్ మొత్తంలో ఒకేఒక్క తెలుగు సినిమాకు కూడా ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. అదే గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘ఆక్సిజన్’. ఈ మూవీ కమర్షియల్‌గా అంత హిట్ కాకపోవడంతో ఆ తర్వాత తెలుగులో మిలన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు.


Also Read: క్రేజ్ తగ్గినా బిజినెస్​లో తగ్గలే - 'లియో' ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని వందల కోట్లా?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial