Kiran Abbavaram Next Movie is Ka: యంగ్ టాలంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమాలంటే ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన కథలు, డిఫరెంట్ జానర్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఆయన నటించిన రాజావారు రాణిగారు, ఎస్‌ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే.. వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆడియన్స్ నంచి మంచి ఆదరణ పొందాయి. ఇక తర్వాత కిరణ్ అబ్బవరంలో ఖాతాలో పెద్దగా హిట్ లేదని చెప్పాలని. ఇటీవల మిటర్, రూల్స్ రంజన్ సినిమాలో నటించారు.
కానీ ఇవి బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయాయి. ఇప్పుడీ హీరోకి భారీ హిట్ కావాలని. అందుకే ఈ సారి పాన్ ఇండియా చిత్రంతో రెడీ అయ్యాడు. పీరియాడికల్ యాక్షన్ తెరకెక్కుతున్న ఈ సినిమాను తాజాగా ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. అంతేకాదు ఈ మూవీ సింగిల్ లేటర్‌లో టైటిల్‌ని ఖరారు.తాజాగా ఈ సినిమాను ప్రకటిస్తూ టైటిల్ కూడా ప్రకటించారు. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గోపాలకృష్ణ నిర్మాణంలో దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్‌గా రాబోతున్న ఈ సినిమాక "క" అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ ఆసక్తిని పెంచుతోంది.
అంతేకాదు ఈ సందర్భంగా మూవీ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరం లుక్ మూవీపై హైప్ క్రియేట్ చేస్తుంది. డార్క్ థీమ్‌లో డిజైన్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ కిరణ్ అబ్బవరం బ్యాక్ నుంచి మాత్రమే కనిపిస్తుంది. ఇందులో అతడు గుబురు హెయిర్‌తో కొత్తగా కనిపించాడు. దీంతో కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడని అనిపిస్తుంది. పోస్టర్‌లో అతడి మేకోవర్ ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు టైటిల్ కూడా చర్చనీయాంశం అయ్యింది. జస్ట్ క అనే టైటిల్ పెట్టడం వెనక అర్థం ఏంటని, అసలు మూవీ కాన్సెప్ట్ ఎంటనేది చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ముందు నుంచి ఎలాంటి ప్రకటన లేకుండ కిరణ్ అబ్బవరం సైలెంట్‌గా 'క' మూవీ షూటింగ్ కానిచ్చేసాడంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తారని సమాచారం. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పీరియాడిక్, భారీ బడ్జెట్ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇది అతడి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని చెప్పాలి.