Bahishkarana Web Series Trailer Out: తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ 'బహిష్కరణ'.  ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్  జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. విలేజ్ రివేంజ్ డ్రామాగా రూపోందిన ఈ వెబ్‌ సిరీస్‌లో అంజలితో పాటు అనన్య నాగళ్ల, శ్రీతేజ్‌లు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో విడుదల కాననన్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ విడుదల చేసింది జీ5 సంస్థ. టాలీవుడ్‌ నాగార్జున చేతుల మీదుగా 'బహిష్కరణ' ట్రైలర్‌ని విడుదల చేశారు.  విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.


ముఖ్యంగా అంజలి తన యాక్టింగ్‌ స్కిల్స్‌లో మరోసారి అదరగొట్టింది. అమ్మోరు తల్లిలో రెచ్చిపోయి విలన్‌లను చంపుతూ విశ్వరూపం చూపించింది. మొత్తం 6 ఎపిసోడ్స్‌గా రాబోయే ఈ వెబ్‌ ట్రైలర్‌ విషయానికి వస్తే.. "మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా.. చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌టమే" అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభ‌మైంది. ఆ తర్వాత పల్లెటూరు అందాల గురించి వివరిస్తూ ఉండగ.. అంజలి పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఆ ఊరు పెద్ద మనుషులు రాజ్యమేలుతు కింది స్థాయి వర్గాలను బానిసల్లా చూసే ఆ ఊరిలోకి పుష్ప(అంజలి) అనే అందమైన అమ్మాయి అడుగుపెడుతుంది. 'మనసు ఏమంటుందయ్యా.. ఇంకా కొత్త రుచులు తగిలిదే బాగుండు అంటుంది' అని అంజలి పాత్ర ఎంట్రీ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంది.



ఆ తర్వాత బాగా నచ్చాలిరా.. పిచ్చి ఉండాలిరా మనిషి అంటే.. అప్పుడు వారి చిటికెల వేళు తగిలితే సుర్రూ.. మంటది చూడు అదిలా ఆనందమంటే" అనే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ఆ గ్రామంలోకి వచ్చిన అంజలితో శ్రీతేజ పరిచయం, ప్రేమ.. సీన్స్‌ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ క్రమంలో "పుట్టినప్పుటి నుంచి ఈ ఊరు ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. నువ్వు నాతో ఉంటే సానా బాగుంటుంది పుష్ప" లీడ్ రోల్ శ్రీతేజ డైలాగ్‌ ఆకట్టుకుంది. మా కాళ్ల కింద బతకడానికి.. మా పక్కలో నలగడానికి పుట్టినోళ్లే మీరూ"అనే డైలాగ్‌తో మూవీ ఎలా ఉండనుందనేది క్లారిటీ ఇచ్చింది టీం. 


ఓ గ్రామంలో ఊరు పెద్దల ఆరాచాకాలు అక్కడి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. కింది స్థాయిలో వర్గాల పట్ల వారు వ్యవహరించే తీరు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆ గ్రామంలో పెద్ద మనుషులు చలామణి అవుతూ వారు చేసే దురాగతాలను చూపించారు. అలాంటి పల్లెటూరికి వచ్చిన పుష్ప(అంజలి) ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంది? ఆమెకు ఆ ఊరి పెద్దకు సంబంధమేంటి? అసలు పుష్ప అక్కడికి ఎందుకు వచ్చింది? వంటి అంశాలు మూవీపై ఆసక్తిని పెంచుతున్నారు. మరి వాటన్నింటికి సమాధానం దొరకంటే వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే. మొత్తానికి విలేజ్‌ రివేంజ్‌ డ్రామాగా రూపొందిన 'బహిష్కరణ' ట్రైలర్‌ వెబ్‌ సిరీస్‌పై ఆసక్తిని పెంచుతుంది. ముఖేష్‌ ప్రజాపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సరీస్‌కి సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూర్చారు. 


Also Read: భారతీయుడు 2 టికెట్ ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్, కానీ కొన్ని కండిషన్స్